Dragon: శ్రీలంకకు ఎన్టీఆర్ 'డ్రాగన్'... వచ్చే నెలలో యాక్షన్ వేట మొదలు
Dragon Shooting Update: ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ సినిమా 'డ్రాగన్'. త్వరలో శ్రీలంక వెళుతోందీ టీం. అక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ తీయనున్నారు.

NTR Prashanth Neel Dragon Latest News: ఎన్టీఆర్ హీరోగా బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కితున్న పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ 'డ్రాగన్'. ఈ సినిమా గురించి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే... అప్ కమింగ్ షెడ్యూల్ శ్రీలంకలో చేయనున్నారు.
జూలైలో శ్రీలంకకు ఎన్టీఆర్ 'డ్రాగన్'
జూలై... అంటే వచ్చే నెలలో ఎన్టీఆర్ 'డ్రాగన్' టీమ్ శ్రీలంకకు ప్రయాణం కానుంది. అక్కడ కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. హీరోతో పాటు ప్రధాన తారాగణంపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఓపియమ్ / నల్లమందు సాగు, డ్రగ్స్ బేస్డ్ కథతో భారీ యాక్షన్ డ్రామా స్క్రిప్ట్ పేపర్ చేశారు ప్రశాంత్ నీల్. కథలో ముంబైతో పాటు గోల్డెన్ ట్రయాంగిల్ అంటూ ఆసియా దేశాలను చూపించారు. దట్టమైన అడవులు, కొండల నేపథ్యంలో సన్నివేశాలు కొన్ని ఉన్నాయట. వాటిని శ్రీలంకలోని అద్భుతమైన, సహజ సిద్ధమైన లోకేషన్లలో షూట్ చేయాలని ప్లాన్ చేశారట. ఎన్టీఆర్‌పై హై వోల్టేజ్ యాక్షన్ ఘట్టాలను షూట్ చేయనున్నారు. సుమారు నెల పాటు శ్రీలంక షెడ్యూల్ ఉంటుందని టాక్. దీనితో సినిమాలోని మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుందట.
Also Read: Janhvi Kapoor - 'పెద్ది'కి జాన్వీ కపూర్ షాక్... ఫోనులు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న 'డ్రాగన్'లో ల్యూగర్ (Luger) పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. దీని కోసం ఆయన మేకోవర్ అయ్యారు. కాస్త సన్నబడ్డాడు. అదే సమయంలో మజిల్డ్ బాడీతో కనిపించారు. ఇందులో 'సప్త సాగరాలు దాటి', 'కాంతార 2' ఫేమ్, కన్నడ నటి రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా... అనిల్ కపూర్, బిజు మీనన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీత దర్శకుడు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది.
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు






















