అన్వేషించండి

NTR AdaviRamudu: సీనియర్ ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ రి-రిలీజ్ - ఆ విషయంలో ఫీలవుతున్న ఫ్యాన్స్?

సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ సినిమా రిరీలీజ్ కానుంది. అయితే.. అభిమానులు ఆ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

NTR AdaviRamudu: స్టార్ హీరోలకు కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు థియేటర్లో మరోసారి రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు కూడా తమ అభిమాన హీరోలు నటించిన మంచి బ్లాక్ బస్టర్ సినిమాలను మరోసారి థియేటర్లో చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, రజినీకాంత్, తరుణ్ ఇలా చాలామంది స్టార్ హీరోల సినిమాలు థియేటర్లో రీ రిలీజ్ అయ్యి బాగా సందడి చేశాయి. ఇక అభిమానులు ఆ సినిమాలు చూస్తూ మరోసారి థియేటర్లో హైప్ క్రియేట్ చేశారు. అయితే ఇదంతా పక్కన పెడితే సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ మరోసారి రీ రిలీజ్ కావటానికి సిద్ధంగా ఉంది.

1977లో సీనియర్ ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన సినిమా ‘అడవి రాముడు’. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇందులో జయప్రద, జయసుధ హీరోయిన్ లుగా నటించారు. ఇక ఈ సినిమాకు బాలసుబ్రమణ్యం నేపథ్య గానం అందించగా మహదేవన్ సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమాను సత్య చిత్రం నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ సినిమాను అప్పటి ప్రేక్షకులు చూసి ఓ రేంజ్ లో ఫిదా అయ్యారని చెప్పాలి.

రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘సింహాద్రి’ సినిమాను విడుదల చేయగా.. నందమూరి అభిమానులు థియేటర్లో ఎంతల రచ్చ చేశారో చూసాం. ఈ సినిమా ఏకంగా 1200 కు పైగా థియేటర్స్ లో విడుదలై హంగామ సృష్టించింది. అయితే మే 28న సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ‘అడవి రాముడు’ సినిమాను ఫోర్ కే వెర్షన్ లో రీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

అయితే ఈ సినిమా రీ రిలీజ్ కేవలం అమెరికా వరకు మాత్రమే పరిమితం అయిందని తెలిసింది. అమెరికాలో ఏకంగా 75 సెంటర్స్ లో ‘అడవి రాముడు’ విడుదల చేయనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రీ రిలీజ్ చేస్తారో లేదో అనుమానాలు రావడంతో నందమూరి అభిమానులు ఫీల్ అవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో బజ్ క్రియేట్ చేసిన నందమూరి అభిమానులు.. సీనియర్ ఎన్టీఆర్ సినిమాతో మరింత బజ్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అన్న గారి సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగులో విడుదల చేస్తారు లేదో చూడాలి. ఎన్టీఆర్ జయంతి వేడుకలకు సమయం మరెన్నో రోజులు లేవు. మరి, దీనిపై ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి ఫ్యామిలీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి’ రీరిలీజ్‌కు అదిరిపోయే కలెక్షన్స్

ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో భారీ అంచనాల నడుమ 9 జులై 2003వ సంవత్సరంలో విడుదలైన 'సింహాద్రి'(Simhadri) మరో సారి ట్రెండింగ్ లో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు సందర్భంగా మే 20న మేకర్స్ ఇటీవలే మరోసారి థియేటర్లలో రిలీజ్ చేశారు. భూమిక చావ్లా , అంకిత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి 'సింహాద్రి' అదే కలెక్షన్లను కొనసాగిస్తోంది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.5.2 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. దీంతో 'సింహాద్రి' 'ఆల్ టై రికార్డ్ సినిమా'ల జాబితాలో మరోసారి చేరిపోయింది.

Read Also: పవన్ - సాయి తేజ్ - ఇంతకీ ఇద్దరిలో దేవుడెవరు 'బ్రో'?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Kohli Vs Media: ఆసీస్ మీడియాపై కోహ్లీ గుస్సా - మాటల యుద్ధానికి దిగిన స్టార్ బ్యాటర్, అసలు ఏం జరిగిందంటే?
ఆసీస్ మీడియాపై కోహ్లీ గుస్సా - మాటల యుద్ధానికి దిగిన స్టార్ బ్యాటర్, అసలు ఏం జరిగిందంటే?
Embed widget