అన్వేషించండి

Ghilli: ‘ఒక్కడు’ రీమేక్ ‘గిల్లి’కి యమ క్రేజ్ - ఈ మూవీకి ఫస్ట్ ఛాయిస్ విజయ్, త్రిష కాదట, మరెవ్వరో తెలుసా?

Ghilli Movie: ‘గిల్లి’ మూవీ రీ రిలీజ్ అవ్వడంతో ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సినిమాకు ముందుగా హీరోహీరోయిన్లుగా విజయ్, త్రిషలను అనుకోలేదనే వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

Ghilli Re Release: 20 ఏళ్ల క్రితం విడుదలయినా కూడా ఇప్పటికీ తమిళ ప్రేక్షకులు మర్చిపోలేని సినిమాలు లిస్ట్‌లో కచ్చితంగా ‘గిల్లి’ కూడా ఉంటుంది. తెలుగులో మహేశ్ బాబు నటించిన ‘ఒక్కడు’ రీమేకే ‘గిల్లి’. ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ మూవీ రీ రిలీజ్ అయ్యింది. ‘గిల్లి’ని థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలో రావడంతో కలెక్షన్స్ విషయంలో రికార్డులు సృష్టిస్తోంది ఈ సినిమా. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఎక్కడ చూసినా ‘గిల్లి’ గురించే హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ మూవీ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. 

కమిట్మెంట్స్ వల్లే..

‘ఒక్కడు’లో మహేశ్ బాబు, భూమిక జంటకు ఎన్ని మార్కులు పడ్డాయో.. ‘గిల్లి’లో విజయ్, త్రిష జోడీకి కూడా అన్నే మార్కులు పడ్డాయి. విజయ్ కెరీర్‌లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. అంతే కాకుండా ఈ సినిమా తర్వాతే త్రిషకు కూడా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు పెరిగాయి. అయితే ముందుగా ‘గిల్లి’ సినిమా కోసం హీరోహీరోయిన్లుగా విజయ్, త్రిషలను అనుకోలేదట దర్శకుడు ధరణి. ముందుగా ‘గిల్లి’లో హీరోగా విజయ్ స్థానంలో విక్రమ్‌ను అనుకున్నారట. ఇక త్రిష స్థానంలో జ్యోతిక హీరోయిన్‌గా చేస్తే బాగుంటుందని చర్చలు కూడా జరిపారట. కానీ విక్రమ్, జ్యోతికలకు అప్పటికే పలు కమిట్మెంట్స్ ఉండడంతో ‘గిల్లి’ని రిజెక్ట్ చేశారట.

త్రిష హ్యాపీ..

‘గిల్లి’ మూవీ విజయ్, త్రిషల కెరీర్‌లో మర్చిపోలేని సినిమాగా నిలిచిపోయింది. కానీ విక్రమ్, జ్యోతిక ఆ అవకాశాన్ని వదులుకున్నారు కాబట్టే ఈ మూవీ వీరి చేతికి వచ్చిందనే వార్త ప్రస్తుతం కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. ‘గిల్లి’లో విజయ్, త్రిషల కెమిస్ట్రీకి మేకర్స్ ఫిదా అవ్వడంతో వీరు మరెన్నో సినిమాల్లో కలిసి నటించే అవకాశం లభించింది. ఇక ‘గిల్లి’ రీ రిలీజ్ హడావిడిని చూసిన త్రిష.. స్వయంగా తన సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ కూడా షేర్ చేసింది. ఈ మూవీ విడుదలయ్యి 20 ఏళ్లు అయ్యిందని, మళ్లీ అంతా కొత్తగా చూసినట్టు ఉందని సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఎన్నో ఏళ్ల తర్వాత విజయ్, త్రిష కలిసి మళ్లీ లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన ‘లియో’లో కలిసి నటించారు.

ఓ రేంజ్ కలెక్షన్స్..

ప్రస్తుతం టాలీవుడ్‌లో మాత్రమే రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది అనుకుంటుండగా.. తమిళంలో ‘గిల్లి’ కూడా రీ రిలీజ్ అయ్యి.. ఓ రేంజ్‌లో కలెక్షన్స్‌ను రాబడుతోంది. ఈ రీ రిలీజ్‌ల విషయంలో కేవలం మొదటిరోజు మాత్రమే థియేటర్లలో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. కానీ ‘గిల్లి’ విషయంలో అలా జరగలేదు. వరుసగా మూడు రోజులు ప్రేక్షకులు.. ‘గిల్లి’ రీ రిలీజ్ కోసం థియేటర్లకు వెళ్లారు. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఇలాగే కంటిన్యూ అయితే కచ్చితంగా ఈ మూవీ రూ.25 నుంచి 30 కోట్లు కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ‘టైటానిక్’కే పోటీ ఇస్తున్న విజయ్, త్రిషాల 'గిల్లి' మూవీ - రీ రిలీజ్‌లో కళ్లు చెదిరే కలెక్షన్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
UP Women Commission: మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
More Drink Less Kick : ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
Embed widget