Roshan Meka: ప్రభాస్, విజయ్ దేవరకొండ కాదు... శ్రీకాంత్ తనయుడి దగ్గరకు భారీ మైథలాజికల్ ఫాంటసీ ఫిల్మ్!
Jatayu Movie Update: దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ 'జటాయు'. అందులో ప్రభాస్ హీరోగా నటిస్తారని తొలుత వినిపించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ పేరు వచ్చింది. ఇప్పుడు రోషన్ దగ్గర ఆగింది.

సున్నితమైన హాస్యం, కుటుంబ విలువలతో కూడిన సినిమాలు తీస్తారని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohan Krishna Indraganti)కి ప్రేక్షకులలో మంచి పేరు ఉంది. అయితే నేచురల్ స్టార్ నాని, నవ దళపతి సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తీసిన 'వి' సినిమాతో తాను యాక్షన్ ఎంటర్టైనర్స్ కూడా తీయగలనని ఆయన నిరూపించుకున్నారు. అటువంటి మోహనకృష్ణ ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమిటో తెలుసుగా? 'జటాయు' (Jatayu Movie). ఇప్పుడు మరోసారి ఈ సినిమా వార్తల్లోకి వచ్చింది.
శ్రీకాంత్ తనయుడు రోషన్ దగ్గరకు 'జటాయు'!
'వి' సినిమా చేసే సమయంలో నిర్మాత 'దిల్' రాజు (Dil Raju)కు 'జటాయు' కథ వినిపించారు మోహనకృష్ణ ఇంద్రగంటి. కథ నచ్చడంతో ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు రాజు గారు. తొలుత ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తారని వార్తలు వచ్చాయి.
రామాయణంలో 'జటాయు' పక్షి పాత్ర గురించి హిందువులలో చాలా మందికి తెలుసు. ఇటీవల 'మిరాయ్' సినిమాలో సంపాతి పక్షిని చూపించారు. ఆ సన్నివేశాలకు రెస్పాన్స్ అదిరింది. దాంతో 'జటాయు' ప్రస్తావన మరోసారి చిత్రసీమలో మొదలైంది. మైథాలజీ టచ్ ఉండడంతో పాటు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం వల్ల ప్రభాస్ హీరోగా చేస్తే పాన్ ఇండియా స్థాయిలో వర్కౌట్ అవుతుందని భావించారు. ప్రస్తుతం రెబల్ స్టార్ లైనప్ చూస్తే ఈ సినిమా చేసే అవకాశం లేదు. ప్రియదర్శి హీరోగా తీసిన 'సారంగపాణి జాతకం' విడుదల సమయంలో విజయ్ దేవరకొండ హీరోగా 'జటాయు' తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు మోహనకృష్ణ ఇంద్రగంటి స్వయంగా చెప్పారు. అయితే ఇప్పుడు ఆ కథ రోషన్ దగ్గరకు వెళ్లిందని తెలిసింది.
Also Read: నిర్మాతగా సుకుమార్ భార్య తబిత... పదేళ్ళ క్రితం వచ్చిన బోల్డ్ సినిమాకు సీక్వెల్!
శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక (Roshan Meka)ను ఇటీవల మోహనకృష్ణ ఇంద్రగంటి కలిశారట. 'జటాయు' కథను చెప్పారట. కథ విని రోషన్ చాలా ఇంప్రెస్ అయ్యారని, ఆ సినిమాలో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నారని తెలిసింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రోషన్ హీరోగా 'జటాయు' సినిమా పట్టాలు ఎక్కడం దాదాపు ఖాయం అయినట్లే అని టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read: కింగ్‌డమ్ ఫ్లాప్ కాదు... బిజినెస్ లెక్కల బయటకు తీసిన నాగవంశీ
డిసెంబర్ 25న థియేటర్లలోకి 'ఛాంపియన్'!
శ్రీకాంత్ తనయుడు రోషన్ త్వరలో ఒక మంచి స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన 'పెళ్లి సందడి' సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అయ్యారు. అంతకు ముందు 'నిర్మలా కాన్వెంట్', 'రుద్రమదేవి' సినిమాలలో బాల నటుడిగా చేశారు. 'పెళ్లి సందడి' తర్వాత కొంత విరామం తీసుకున్న ఆయన వైజయంతి మూవీస్ బ్యానర్‌లో 'ఛాంపియన్' చేశారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలోకి ఆ సినిమా రానుంది. ఆ తరువాత చేసే సినిమా మోహనకృష్ణ ఇంద్రగంటి 'జటాయు' కావచ్చు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా చేయనున్నారు. 'దిల్' రాజు ప్రొడ్యూస్ చేస్తారని టాక్.





















