Nikhil Pallavi Varma: వారసుడొచ్చాడు - పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నిఖిల్ భార్య పల్లవి
Hero Nikhil and his wife Pallavi welcome a baby boy: హీరో నిఖిల్ ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. ఆయన తండ్రి అయ్యాయి. ఈ రోజు పల్లవి పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చారు.
Nikhil Siddharth, Pallavi Varma welcome first child: యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ తండ్రి అయ్యారు. ఆయన భార్య పల్లవి వర్మ ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చారు. కుమారుడిని చేతుల్లోకి తీసుకున్న నిఖిల్... నుదుటిపై మురిపెంగా ముద్దు పెట్టిన ఫోటోను విడుదల చేశారు.
వారసుడు రావడంతో నిఖిల్ ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. తల్లి బిడ్డ... ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిసింది. నిఖిల్ భార్య పల్లవి వర్మ డాక్టర్ కూడా! గర్భవతి అని తెలిసినప్పటి నుంచి ఆమె అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు.
Hero @actor_Nikhil and his wife Pallavi are now blessed with a BABY BOY❤️
— Vamsi Kaka (@vamsikaka) February 21, 2024
Warmest congratulations to the glowing couple on this delightful addition to their family ✨ pic.twitter.com/AHH9N5quii
జనవరి నెలాఖరున సీమంతం...
డైపర్ తొడిగిన నిఖిల్ వీడియో!
పల్లవి వర్మ ప్రెగ్నెంట్ అని తొలుత నిఖిల్ చెప్పలేదు. అయితే... ఆయన తండ్రి కాబోతున్న విషయం ఫిల్మ్ నగర్ ప్రముఖుల ద్వారా బయటకు వచ్చింది. ఆ వార్త నిజమని జనవరి నెలాఖరున క్లారిటీ వచ్చింది. భార్య పల్లవి సీమంతం ఫోటోలను సోషల్ మీడియాలో నిఖిల్ చాలా సంతోషంగా షేర్ చేశారు నిఖిల్. తన ఆనందాన్ని వీడియోలో వ్యక్తం చేశారు.
''సీమంతం... బేబీ షవర్ అని విదేశీయులు వేడుకగా చేస్తారు. అది మన భారతీయ సంప్రదాయంలో ముఖ్యమైనది. మా మొదటి బేబీ కోసం మేం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని పల్లవి, నేను సంతోషంగా వెల్లడిస్తున్నాం. మాకు మీ ఆశీస్సులు పంపించండి'' అని సీమంతం ఫోటోలను నిఖిల్ విడుదల చేశారు. ఆ తర్వాత బేబీ బొమ్మకు డైపర్ తొడుగుతున్న వీడియో విడుదల చేశారు. నిఖిల్, పల్లవి వర్మ కొన్నాళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత 2020లో వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు.
పీరియాడిక్ ఫిల్మ్ 'స్వయంభు' చేస్తున్న నిఖిల్!
Nikhil Siddhartha Upcoming Movies: ఇప్పుడు నిఖిల్ చేస్తున్న సినిమాలకు వస్తే... 'స్వయంభు' అనే పీరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నారు. అది పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. అందులో పొడవాటి జుట్టుతో ఆయన కనిపించారు. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్. 'స్వయంభు' కాకుండా మరో పాన్ ఇండియా సినిమా 'ది ఇండియా హౌస్' సినిమా చేస్తున్నారు. దానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పకులు.
'కార్తికేయ', 'కార్తికేయ 2' సినిమాలకు కొనసాగింపుగా...
హీరోగా నిఖిల్ ప్రయాణంలో 'కార్తికేయ' సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. తన స్నేహితుడు చందు మొండేటి దర్శకత్వంలో చేసిన ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన 'కార్తికేయ 2' అయితే పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించింది. ఆ రెండిటితో కార్తికేయ ఫ్రాంచైజీని ఆపడం లేదు. కంటిన్యూ చేయాలని నిఖిల్, చందు మొండేటి నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ చేస్తున్న సినిమాలు పూర్తి అయ్యాక 'కార్తికేయ 3' సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.