Nidhi Agerwal: 'రాజా సాబ్, హరిహర వీరమల్లు'పై క్రేజీ అప్డేట్స్ ఇచ్చిన నిధి అగర్వాల్
ఆ సీక్వెల్ ఊహించిన దానికంటే ముందే... అంటూ తాజాగా జరిగిన చిట్ చాట్ లో రాజాసాబ్, హరి హర వీరమల్లుపై క్రేజీ అప్డేట్స్ ఇచ్చింది హీరోయిన్ నిధి అగర్వాల్.
టాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు చేతిలో ఉన్న హీరోయిన్ నిధి అగర్వాల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తూనే, మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'ది రాజా సాబ్'లో రొమాన్స్ చేయబోతోంది. తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ 'ఆస్క్ నిధి' పేరుతో సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో భాగంగా తన పర్సనల్ విషయాలతో పాటు కెరీర్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అలాగే అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పింది నిధి అగర్వాల్.
ప్రభాస్ కలిసిన నటిస్తున్న 'ది రాజా సాబ్' గురించి స్పందిస్తూ సెట్లో సరదాగా పని చేశామని చెప్పుకొచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ సెల్ఫీని దిగానని, త్వరలోనే దాన్ని పోస్ట్ చేస్తానని ఓ అభిమానికి రిప్లై ఇచ్చింది. అంతేకాకుండా తాను 'అందరికీ నమస్కారం' అనే బ్యాచ్ కాదని, తనకు తెలుగు బాగా మాట్లాడడం వచ్చు అని చెప్పి టాలీవుడ్ అభిమానుల మనసును దోచుకుంది. ఇక ప్రస్తుతం ఉన్న స్టార్స్ కి పిఆర్ ఉండడం అనేది చాలా కామన్. కానీ తనకు మాత్రం పిఆర్ ను మెయింటైన్ చేయడం కష్టంగా అనిపిస్తుందని వెల్లడించింది. ఇక వచ్చే ఏడాది 'ది రాజా సాబ్' మూవీతో పాటు 'హరిహర వీరమల్లు' సినిమా కూడా రిలీజ్ అవుతుందని చెప్పింది. ఆ రెండు సినిమాలతో తాను అభిమానులకు మరింతగా చేరువవుతాననే నమ్మకాన్ని వ్యక్తం చేసింది నిధి అగర్వాల్. అంతేకాకుండా ఈ రెండు సినిమాలతో పాటు మరో సర్ప్రైజింగ్ మూవీ కూడా ఉంటుందని చెప్పి సర్ప్రైజ్ చేసింది.
Yes! #HariHaraVeeraMallu March 28 2025#RajaSaab April 10 2025
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) December 3, 2024
And one small surprise 😉 https://t.co/15pi5yngLW
ఓ అభిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు డార్లింగ్ కలిసి ఉన్న పిక్ ను షేర్ చేయగా, వాళ్ళిద్దరికీ తాను వీరాభిమానిని అంటూ సమాధానం చెప్పింది నిధి. ఇక నాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నించగా... 'సూపర్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ గొప్ప సినిమా ఎంచుకుంటాడు' అని చెప్పుకొచ్చింది. 'మీ నుంచి అరుంధతి లాంటి సినిమాను ఎక్స్పెక్ట్ చేయొచ్చా?' అంటే... తప్పకుండా అంటూ సమాధానం చెప్పింది. 'పవన్ కళ్యాణ్, ప్రభాస్ కు మధ్య డిఫరెన్స్ ఏంటి ?' అనే ప్రశ్నకు... 'చాలా ఉంది. కానీ నేను సిమిలారిటీ చెప్తాను. వాళ్ళిద్దరికీ లైఫ్ కంటే లార్జర్ ఔరా ఉంది' అని వివరించింది. అలాగే తన సినిమాల్లో 'మిస్టర్ మజ్ను' సాంగ్స్ చాలా ఇష్టమని వెల్లడించింది.
Also Read:'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?
'ఎందుకు తక్కువ సినిమాలు చేస్తున్నారు తెలుగులో?' అని ఒక అభిమాని ప్రశ్నించగా.. "మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఒకే ఏడాదిలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయితే బోర్ కొట్టే ఛాన్స్ ఉంది' అంటూ ఈ సందర్భంగా వెల్లడించింది నిధి అగర్వాల్. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి, ప్రేక్షకుల నుంచి తను అన్ కండిషనల్ లవ్ కండిషనర్ ను నేర్చుకున్నానని వెల్లడించింది. అలాగే 'ది రాజా సాబ్' మూవీ ఒక అథెంటిక్ హర్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ అని, ప్రతి సన్నివేశంలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని వివరించింది. అలాగే 'హరిహర వీరమల్లు'తో పాటు 'రాజా సాబ్' సినిమాల్లోని తన రెండు పాత్రలను ఇష్టపడతారని ఆశిస్తున్నాను అంటూ మరో అభిమానికి సమాధానం చెప్పింది. ఇక తమిళంలో తనకు 'అమరన్' సినిమా అంటే ఇష్టమని, 'హరిహర వీరమల్లు' పార్ట్ 2 ఊహించిన దాని కంటే ముందుగానే రాబోతుందని చెప్పి మరో సర్ప్రైజ్ ఇచ్చింది.
Part 2 will be sooner than you think 🙏🏼 #HariHaraVeeraMallu https://t.co/b40x10XQee
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) December 3, 2024