Nellore Crime: అబ్బాయిని అమ్మాయిగా మారుస్తూ ప్రాణం తీసిన ముగ్గురు అరెస్ట్

నెల్లూరు జిల్లాలో ఇటీవల ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ వికటించి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్ కి పంపించారు.

FOLLOW US: 

నెల్లూరు జిల్లాలో ఇటీవల ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ వికటించి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్ కి పంపించారు. ఆపరేషన్ చేయలేమని తెలిసి, ఆపరేషన్ వికటిస్తే ప్రాణం పోతుందని తెలిసి కూడా ఆ యువకుడి ప్రాణంతో చెలగాటమాడారని పోలీసులు నిర్థారించారు. ప్రాణం పోయిన తర్వాత వెంటనే ముగ్గురూ పారిపోయారని, వారిని వెదికి పట్టుకున్నట్టు చెప్పారు. 

అసలేం జరిగింది..? 
ఫిబ్రవరి 23న నెల్లూరు నగరంలోని లాడ్జీలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. లాడ్జి వారిచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని కామేపల్లికి చెందిన బల్లికూరు శ్రీకాంత్‌ అలియాస్ అమూల్య కొంతకాలంగా విశాఖపట్నం సింగరాయమెట్టు మురళీనగర్‌ కు చెందిన గురుగుబిల్లి మోనాలిసా అలియాస్ అశోక్‌ తో స్నేహంగా ఉంటూ పలు ప్రాంతాలు తిరిగారు. వీరిద్దరూ ట్రాన్స్ జెండర్లు. అయితే శ్రీకాంత్ ఆపరేషన్ చేయించుకోలేదు. మగవాడిగా ఉంటూనే, ఆడవారిగా వేషధారణ చేసుకునేవాడు. అతడికి అమ్మాయి లక్షణాలు ఉండటంతో.. తల్లిదండ్రులు పెళ్లి చేసినా భార్యతో కాపురం చేయలేదు. విడాకులయ్యాయి. మోనాలిసాతో స్నేహం కుదిరాక ఇద్దరూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లి వస్తుండేవారు.  ఈ క్రమంలో వీరికి నెల్లూరు జిల్లా కలువాయి గ్రామానికి చెందిన అరిబోయిన మస్తాన్‌ బాబు, కొండాపురం మండలం కొత్తపేటకు చెందిన నలగట్ల జీవతో పరిచయమైంది. 

ఒకరోజు శ్రీకాంత్‌ అలియాస్ అమూల్యను ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా మిగతా ముగ్గురు ఒత్తిడి తెచ్చారు. తమతో కలిసి తిరగాలంటే పూర్తిస్థాయిలో లింగ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకోవాలని బలవంతం చేశారు. నెల్లూరులోని ఓ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నారు. బీఫార్మసీ చేసిన మస్తాన్‌ బాబు తానే శస్త్రచికిత్స చేస్తానని చెప్పాడు. 23వ తేదీ ఆపరేషన్‌ చేసే క్రమంలో శ్రీకాంత్‌ మర్మాంగాలను తొలగించడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఒక్కసారిగా బీపీ డౌన్‌ కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 24న శ్రీకాంత్‌ అక్క బొడ్డు పల్లవి పోలీసులకిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చిన్నబజారుకు చెందిన పోలీసులు పలుకోణాల్లో విచారించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

లింగమార్పిడి ఆపరేషన్ వికటించి యువకుడు చనిపోయిన ఘటన నెల్లూరులో సంచలనంగా మారింది. అందులోనూ ఆపరేషన్ చేసేందుకు వారంతా ఓ లాడ్జీ గదిని అద్దెకు తీసుకోవడం, తెలిసీ తెలియక మత్తుమందు ఇచ్చి మర్మావయాలు తొలగించడం చేసి నిండు ప్రాణాన్ని బలికొన్నారు ముగ్గురు. మిడిమిడి జ్ఞానంతో ఎవరూ ఇలా చేయొద్దని చెబుతున్నారు పోలీసులు. 

Published at : 03 Mar 2022 01:10 PM (IST) Tags: Nellore news nellore police Nellore Update Nellore Crime

సంబంధిత కథనాలు

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!

Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌	గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !