NBK111 Movie: బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమా పూజకు మూహూర్తం ఖరారు... బడ్జెట్‌లో కోతలు??
Balakrishna Gopichand Malineni Movie: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్ళకముందు బడ్జెట్ విషయంలో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారట.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni)లది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. 'వీర సింహ రెడ్డి'తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బాక్సాఫీస్ బరిలో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మరొక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ వర్గాలలో చక్కర్లు కొడుతుంది.
బడ్జెట్ విషయంలో స్ట్రాంగ్ డెసిషన్!
బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమా సెట్స్ మీదకు వెళ్ళక ముందు బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఒక బలమైన డెసిషన్ తీసుకున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరమైన ఖర్చు పెట్టకూడదని పర్ఫెక్ట్ లెక్కలు వేశారట. తొలుత అనుకున్న బడ్జెట్ కంటే ఎప్పుడు కాస్త తగ్గిందట. ముందు అనుకున్న మొత్తంలో కొంత కోత విధించారట.
Also Read: నిర్మాతగా సుకుమార్ భార్య తబిత... పదేళ్ళ క్రితం వచ్చిన బోల్డ్ సినిమాకు సీక్వెల్!
నవంబర్ రెండో వారంలో బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమా (NBK111 Movie) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఆ తరువాత డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కుతున్న సినిమా. హిస్టారికల్ అంటే భారీ సెట్స్ వేయడం తప్పనిసరి. రాజులు రాజ్యాల నేపథ్యంలో కథ అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఓటీటీ నుంచి భారీ అమౌంట్ రావడం లేదు. అలాగే అమెరికా నుంచి టాక్సులు ఎక్కువ కట్ అయ్యే ఛాన్సులు కనపడుతున్నాయి. అందుకని నిర్మాతకు వచ్చే డబ్బులు కొంత తగ్గే అవకాశం ఉంది. అందుకని ముందు జాగ్రత్త పడుతున్నారు. ఎక్కువ ఖర్చు కాకుండా అవసరం మేరకు ఖర్చు పెడుతూ సినిమా తీయాలని డిసైడ్ అయ్యారట. 'కాంతార' సినిమాటోగ్రాఫర్ అరవింద్ కస్యపు ఈ సినిమాకు వర్క్ చేయనున్నారు.
Also Read: కింగ్‌డమ్ ఫ్లాప్ కాదు... బిజినెస్ లెక్కల బయటకు తీసిన నాగవంశీ
డిసెంబర్ 5న థియేటర్లలోకి 'అఖండ 2'
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి ముందు 'అఖండ 2' పబ్లిసిటీ కార్యక్రమాలు పూర్తి చేయనున్నారు. బాలకృష్ణ డిసెంబర్ 5న ఆ సినిమా థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వానికి తోడు 'అఖండ' బ్లాక్ బస్టర్ కావడం వల్ల ఆ సినిమా మీద భారీ క్రేజ్ నెలకొంది. దాంతో ఆ సినిమా రైట్స్ ద్వారా ఎక్కువ అమౌంట్ వచ్చింది.





















