NBK111 Update : 'NBK111'లో నయనతార ఫస్ట్ లుక్ - బాలయ్య ఎంపైర్‌లోకి పవర్ ఫుల్ క్వీన్ ఎంట్రీ
Nayanthara : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ 'NBK111' నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. అందరూ ఊహించినట్లుగానే ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Nayanthara First Look From NBK111 Movie : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతోన్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'NBK111' (వర్కింగ్ టైటిల్). ఈ మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి కాగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న బిగ్ అప్డేట్ వచ్చేసింది. మూవీలో హీరోయిన్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
పవర్ ఫుల్ 'నయనతార'
ఈ మూవీలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించనున్నారు. పవర్ ఫుల్ రాణి పాత్రలో ఆమె నటించనుండగా ఫస్ట్ లుక్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. యుద్ధ భూమిలో శత్రువులన చెండాడే మహారాణి పాత్రలో ఆమె లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 'సముద్రాల ప్రశాంతతను తుపానుల ఉగ్రతను మోసే రాణి NBK111 సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తోంది.' అంటూ ఎలివేషన్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 26 నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. గతంలోనే ఈ లుక్ రిలీజ్ చేయాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది.
ఇండస్ట్రీలో బాలయ్య, నయన్‌లది హిట్ కాంబో. గతంలో మైథాలజీ, కమర్షియల్ యాక్షన్ మూవీస్ తీసిన ఈ కపుల్ ఫస్ట్ టైం హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో నటిస్తున్నారు. బాపు దర్శకత్వంలో వచ్చిన 'శ్రీరామరాజ్యం', ఆ తర్వాత 'సింహా' మూవీలో, తమిళ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ తీసిన 'జై సింహా'లోనూ నటించారు. ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సొంతం చేసుకోగా... నాలుగోసారి జత కడుతుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
పర్ఫెక్ట్ బడ్జెట్...
గతంలో బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన 'వీర సింహా రెడ్డి' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ మూవీలో బాలయ్యలో మరో మాస్ కోణాన్ని చూశారు ఆడియన్స్. ప్రస్తుతం హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కావడంతో అంతకు మించి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కావడంతో గతం కంటే భిన్నంగా... ఎక్కువ ఖర్చు లేకుండా అవసరం మేర కేటాయిస్తూ మూవీని కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. 'కాంతార' సినిమాటోగ్రాఫర్ అరవింద్ కన్యపు ఈ మూవీకి వర్క్ చేయనున్నారు.
ప్రస్తుతం బాలయ్య 'అఖండ 2'లో నటించగా డిసెంబర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నయనతార మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతోన్న 'మన శంకరవరప్రసాద్'లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుండగా... దీంతో పాటే NBK111 షూటింగ్‌లోనూ పాల్గొననున్నారు.
The Queen who carries the Calm of Oceans and the Fury of Storms, #Nayanthara enters the empire of #NBK111 💥💥
— Vriddhi Cinemas (@vriddhicinemas) November 18, 2025
Warm birthday wishes from the team ❤️
▶️ https://t.co/aAfVRii2vU
HISTORICAL ROAR loading… with gigantic updates soon ❤️🔥#HBDNayanthara
GOD OF MASSES… pic.twitter.com/RETlqAoCKI





















