Dhoolpet Police Station OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్' - నో డైలాగ్స్... టీజర్‌తోనే హైప్ క్రియేట్ చేశారు
Dhoolpet Police Station OTT Platform : మరో క్రైమ్ థ్రిల్లర్ 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' ఓటీటీలోకి నేరుగా రానుంది. ఈ మేరకు టీజర్ రిలీజ్ చేయగా స్ట్రీమింగ్ డేట్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

Ashwin Kumar's Dhoolpet Police Station OTT Release On Aha : క్రైమ్, హారర్, థ్రిల్లింగ్ మూవీస్‌కు ఉండే క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో మరో హారర్ క్రైమ్ థ్రిల్లర్ నేరుగా ఓటీటీలోకి రానుంది. లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్' నేరుగా ఓటీటీలోకే రిలీజ్ కానుంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ టీజర్ వీడియో రిలీజ్ చేశారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం క్రైమ్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, హారర్, థ్రిల్లింగ్ సీన్లతో ఉన్న వీడియో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. 'నేరాల్లో మునిగిపోతున్న నగరం. త్వరలోనే దర్యాప్తు ప్రారంభం.' అంటూ రాసుకొచ్చారు మేకర్స్. మూవీని నేరుగా ఓటీటీలోకే రిలీజ్ చేయనున్నారు. తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుండగా... త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ వెల్లడించనుంది.
ఈ మూవీకి జస్విని దర్శకత్వం వహించగా... అశ్విన్, శ్రీతు, గురు, పదిని కుమార్, ప్రీతి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అశ్వతన్ మ్యూజిక్ అందించారు. ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే క్రైమ్, క్షుద్ర పూజలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నింటినీ ఛేదించే క్రమంలో పోలీసులకు ఎదురైన పరిణామాలను టీజర్లో చూపించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram
Also Read : 'వారణాసి' సినిమా టీజర్లో కనిపించిన 'చినమస్తా దేవి' ఎవరు? రాజమౌళి ఆమె గురించి ఏం చెప్పబోతున్నారు?





















