National Cinema Day : టికెట్ రేట్లు తగ్గితే ఇంత లాభమా - ఒక్క రోజులో 60 లక్షల మంది అంటే మాటలా?
టికెట్ రేట్లు తగ్గిస్తే థియేటర్లకు, మల్టీప్లెక్స్‌లకు సైతం భారతీయ ప్రేక్షకులు వస్తారని చెప్పడానికి 'నేషనల్ సినిమా డే' ఒక ఉదాహరణ. ఒక్క రోజు 60 లక్షల మంది వివిధ సినిమాలు చూశారు.
థియేటర్లలో సినిమాలు చూడటం ప్రేక్షకులు ఎందుకు తగ్గించారు? ఈ ప్రశ్నకు మెజారిటీ జనాలు చెప్పే సమాధానాలతో టికెట్ రేట్లు ముఖ్యమైన అంశం. మన దేశంలో మెజారిటీ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో కూడా మల్టీప్లెక్స్ స్క్రీన్లు మొదలు అయ్యాయి. ఢిల్లీ, ముంబై వంటి మెట్రోపాలిటన్ సిటీలలో తప్పిస్తే... మెజారిటీ ఏరియాల్లో మల్టీప్లెక్స్ టికెట్ రేట్లు రూ. 200 నుంచి రూ. 300 మధ్యలో ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రూ. 500 కూడా ఉన్నాయనుకోండి!
సగటు సామాన్య మధ్య తరగతి ప్రేక్షకుడు కుటుంబంతో సినిమాకు వెళితే కనీసం 1500ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అందుకని, సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప చాలా మంది మల్టీప్లెక్స్ వైపు చూడటం లేదు. ఒకవేళ మల్టీప్లెక్స్ టికెట్ రేట్స్ తగ్గిస్తే? జనాలు రావడానికి రెడీగా ఉన్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్... నేషనల్ సినిమా డే (National Cinema Day 2023)!
టికెట్ రేట్లు తగ్గించడంతో 60 లక్షలకు పైగా సేల్స్!
నేషనల్ సినిమా డే సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) టికెట్ రేట్స్ తగ్గించింది. కేవలం 99 రూపాయలకు సినిమాలను చూపించింది. ఆ రేట్స్ తగ్గించడం ఏదైతే ఉందో... దాని ప్రభావం థియేటర్లలో కనిపించింది. అదీ భారీగా! MAI విడుదల చేసిన లేఖ ప్రకారం... అక్టోబర్ 13న, నేషనల్ సినిమా డే సందర్భంగా 6 మిలియన్లకు పైగా జనాలు థియేటర్లకు వచ్చారు. అంటే... 60 లక్షల మంది కంటే ఎక్కువ ప్రేక్షకులు సినిమాలు చూశారు. 4300 మల్టీప్లెక్స్ స్క్రీన్లలో లెక్కలు ఇవి.
Also Read : 'టైగర్...' సెట్స్‌లో రవితేజకు యాక్సిడెంట్ - 16 కుట్లు పడినా సరే!
MAI is happy to confirm that the second edition of National Cinema Day this year received a big thumbs up from the cinemagoers across the country with a record number of 6+ million moviegoers visiting their local cinema yesterday.#NationalCinemaDay2023 pic.twitter.com/xLSCOGrSTi
— Multiplex Association Of India (@MAofIndia) October 14, 2023
షారుఖ్ ఖాన్ 'జవాన్' విడుదలై నెల దాటింది. కొన్ని రోజులుగా ఆ సినిమాకు రూ. 60 లక్షల నుంచి రూ. 90 లక్షల మధ్య కలెక్షన్లు వస్తున్నాయి. అటువంటిది అక్టోబర్ 13న రూ. 5 కోట్లు వచ్చాయి. ఫస్ట్ వీకెండ్, మొదటి వారం వసూళ్లపై ఆధారపడి సినిమాలు తీస్తున్న చాలా మంది కంటెంట్ బావుంటే, టికెట్ రేట్లు తగ్గిస్తే నెల రోజుల తర్వాత కూడా జనాలు థియేటర్లకు వస్తారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
అక్షయ్ కుమార్ 'మిషన్ రాణిగంజ్' సినిమాకూ మంచి కలెక్షన్స్ వచ్చాయి. అదే విధంగా భూమి పెడ్నేకర్ 'థాంక్ యు ఫర్ కమింగ్', తెలుగు సినిమా 'మ్యాడ్' కూడా అక్టోబర్ 13 కంటే ముందు రోజులతో పోలిస్తే మంచి కలెక్షన్స్ సాధించాయి. హిందీ, తమిళ, తెలుగు నిర్మాతలు టికెట్ రేట్లు తగ్గించే దిశగా ఆలోచిస్తే బావుంటుందని ట్రేడ్ లెక్కలు చూసిన తర్వాత కొందరు జనాలు అభిప్రాయ పడుతున్నారు.
Also Read : 'గాడ్' రివ్యూ : హీరోని సైకో కిల్లర్ టార్గెట్ చేస్తే? - 'జయం' రవి, నయనతార సినిమా హిట్టా? ఫట్టా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial