Nara Rohith Wedding : నారా రోహిత్, శిరీషల వివాహం - వెడ్డింగ్ క్యూట్ మూమెంట్స్... స్పెషల్ వీడియో చూశారా?
Nara Rohith Sireesha Lella : టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, శిరీషల వివాహం గతేడాది ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి వీడియోను షేర్ చేయగా వైరల్ అవుతోంది.

Nara Rohith Sireesha Lella Wedding Celebrations Video : టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, హీరోయిన్ శిరీషల వివాహం గతేడాది అక్టోబర్ 30న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సహా నారా లోకేశ్ కపుల్, బాలకృష్ణ కపుల్, ఇతర సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా వీరి పెళ్లి వీడియోను ఓ ఫోటోగ్రఫీ సంస్థ షేర్ చేయగా వైరల్ అవుతోంది.
ట్రెండింగ్‌లో పెళ్లి వీడియో
పెళ్లి టైంలో కేవలం ఫోటోలు మాత్రమే షేర్ చేయగా... తాజాగా రిలీజ్ చేసిన పెళ్లి వీడియో వైరల్ అవుతోంది. పెళ్లికి కొద్ది రోజుల ముందు నుంచే జరిగిన హల్దీ వేడుకలు, బరాత్‌లతో పాటు ముఖ్యమైన కార్యక్రమాల్లో బెస్ట్ మూమెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి. శిరీష తన భర్త నారా రోహిత్‌తో సందడి చేశారు. వేడుకలో చిన్నారులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. పెళ్లింట్లో దంపతులిద్దరూ సిగ్గు పడుతూ కబుర్లు చెప్పుకున్న మూమెంట్స్ క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : సమ్మర్ రేసు నుంచి తప్పుకొన్న మెగాస్టార్ 'విశ్వంభర' - కొత్త రిలీజ్ ఎప్పుడంటే?
ఏపీలోని రెంటచింతల శిరీష స్వస్థలం. తమ పేరెంట్స్‌కు నాలుగో సంతానమైన ఆమె ఆస్ట్రేలియాలో చదువుకుంది. అక్కడే కొంతకాలం జాబ్ చేసి సినిమాలపై ఇష్టంతో ఇండియాకు తిరిగొచ్చారు. హైదరాబాద్‌లో తన అక్క ఇంటి వద్ద ఉంటూ సినిమాల్లో ట్రై చేశారు. అలా 'ప్రతినిధి 2' ఆడిషన్స్‌లో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. అలా రోహిత్, శిరీషల పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఇక సినిమాల విషయానికొస్తే... 'భైరవం' మూవీతో రీసెంట్‌గా సక్సెస్ బాట పట్టారు నారా రోహిత్. ఆ తర్వాత వచ్చిన 'సుందరకాండ' కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు























