(Source: ECI/ABP News/ABP Majha)
Prathinidhi 2 Trailer: రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే, మీ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి - ఆసక్తిని పెంచుతున్న 'ప్రతినిధి 2' ట్రైలర్
Prathinidhi 2 Trailer: నారా రోహిత్ 'ప్రతినిధి 2' ట్రైలర్ అద్యాంతం ఆసక్తిగా సాగింది. పొలిటికల్ డ్రామా వస్తున్న ఈ ట్రైలర్‌లో రాజకీయ అంశాలను ప్రశ్నించేలా ఉన్న డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.
Nara Rohit Prathinidhi 2 Trailer Out: చాలా రోజుల తర్వాత నారా రోహిత్ నటించిన చిత్రం 'ప్రతినిధి 2'. తొమ్మిదేళ్ల క్రితం రోహిత్ నటించిన ప్రతినిధికి సినిమాకు ఇది సీక్వెల్. సీనియర్ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు (ఏప్రిల్ 19) ట్రైలర్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. పొలిషియన్స్ ప్రశ్నించేలా ఉన్న ఒక్కొక్కొ డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతినిధి 2ను తెరకెక్కించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా రిలీజైన ట్రైలర్ గాంధీ ప్రస్తావనతో ప్రారంభమైంది. 1948లో మన స్వాంతంత్ర్యం కోసం పోరాడిన గాంధీ చనిపోయినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు.
ఎంతమంది గుండెపోటుతో చచ్చారు అనే బ్యాగ్రౌండ్ వాయితో ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత నారా రోహిత్ జర్నలిస్ట్‌గా రాజకీయ నాయకుడిని డెబెట్‌లో ప్రశ్నించే సీన్ ఆకట్టుకుంది. కొండమీద కొబ్బరి కాయలు, బండి మీద బత్తాయి కాయాలు అమ్మాను అంటూ అనడం.. నాయకుడు అవ్వాలంటే చాలా కష్టపాలని అనడం అతడికి కౌంటర్ నారా రోహిత్ వేసిన ప్రశ్నలు ఆకట్టుకున్నాయి. మరి రాష్ట్రానికి అప్పుడు పెరుగుతుంటే మీ ఆస్తులు ఎలా పేరుగుతున్నాయి? అని ప్రశ్నించిన సీన్ అందరిని ఆలోచింపజేశాల ఉంది. రాజకీయ నాయకుడి కోసం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సీన్‌లో చూపించారు. ఆయన తమ దేవుడని, ఆయనకు ఇలా జరిగిందని తెలియగానే.. అంటూ ఓ వ్యక్తి చెప్పడం.. నీ భార్యపిల్లల కంటే నాలుగు పథకాలు ఇచ్చిన ఆయన ఎక్కువ అయ్యారని జర్నలిస్ట్‌గా నారా రోహిత్ ప్రశ్నించిన తీరు ట్రైలర్‌కి హైలెట్‌గా నిలిచింది. ట్రైలర్‌లో ఉదయభాను ఎంట్రీ అదుర్స్ అనిపించేలా ఉంది.
'ఖచ్చితంగా మార్పు వస్తుంది.. అక్షరాలు మార్చకుండ న్యూస్ రాసిన రోజు' అంటూ భానుప్రియ చెప్పిన డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఇక చివరగా.. "ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే అయిదేళ్లు వాడు చెప్పిందే చేయాలి.. డిసైడ్ చేసుకో నిన్ను ఎవడు పరిపాలించాలో.. డిసైడ్ చేసుకో నీకు ఎవరు కావాలో" నారా రోహిత్ ప్రశ్నించిన డైలాగ్ ట్రైలర్‌గా హైలెట్‌గా అని చెప్పాలి. ఇక ట్రైలర్ మధ్య మధ్యలో జర్నలిస్ట్ అయినా నారా రోహిత్‌పై దాడి, యాక్షన్, ఫైట్స్ సీన్స్ ఆసక్తిని రెగిస్తున్నాయి. మొత్తం పొలిటికల్ డ్రామా వస్తున్న ఈ ట్రైలర్‌లో సగటు సమాజంలోని రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇక సినిమా అంతా కూడా ఇలాగే ఉండనుందని తెలుస్తోంది. దీంతో తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచుతుంది. ఇక సినిమా కోసం ఆడియన్స్‌ని వెయిట్ చేయించాలే ఉంది ఈ ట్రైలర్. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు.
Also Read: తండ్రి కాబోతున్న అదితి రావు హైదరి మాజీ భర్త - గతేడాది నటితో పెళ్లి, ఇప్పుడు గుడ్‌న్యూస్