అన్వేషించండి

Hi Nanna OTT : ఓటీటీ లోకి వచ్చేస్తున్న 'హాయ్ నాన్న' - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Hi Nanna : న్యాచురల్ స్టార్ నాని నటించిన 'హాయ్ నాన్న' మూవీ జనవరి 19 లేదా జనవరి 26న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

Hi Nanna OTT Update : న్యాచురల్ స్టార్ నాని హీరోగా రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన 'హాయ్ నాన్న' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. శౌర్యువ్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 7న విడుదలై ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ, కంటతడి పెట్టించే తండ్రీ కూతుర్ల మధ్య బాండింగ్, యాక్టర్స్ పర్ఫామెన్స్ ఈ సినిమాకి  ప్రాణం పోసాయి. దీంతో హాయ్ నాన్న నాని కెరియర్ లోనే మరో ఫీల్ గుడ్ మూవీ గా నిలిచింది. సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా కియారా ఖన్నా నాని కూతురుగా కనిపించింది. సినిమాలో నాని, మృణాల్ ఠాగూర్ మరోసారి బెస్ట్ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని ఎమోషనల్ చేశారు.

ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమవుతోంది. 'హాయ్ నాన్న' డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని రూ.37 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేటర్లో రిలీజ్ అయిన 40 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేసేలా సినిమా ప్రొడ్యూసర్స్ నెట్ ఫ్లిక్స్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిసింది. దాని ప్రకారం హాయ్ నాన్న మూవీ జనవరి 19 లేదా జనవరి 26 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడంతో సంక్రాంతికి ఓటీటీ లో వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.

జనవరి 19 లేదా రిపబ్లిక్ డే సందర్భంగా హాయ్ నాన్న ఓటీటీ లో వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ నుంచి దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే హాయ్ నాన్న మూవీకి రూ. 27.85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 28.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ని అందుకొని లాభాల బాట పట్టింది. అంతేకాదు ఓవర్సీస్ లో వీకెండ్ పూర్తవక ముందే ఈ సినిమా వన్ మిలియన్ మార్క్ దాటింది.

దీంతో టైర్ 2 హీరోల్లో ఎక్కువ సార్లు ఓవర్సీస్ మార్కెట్ వద్ద 1 మిలియన్ మార్క్ అందుకున్న హీరోగా నాని సరికొత్త రికార్డ్ క్రేయేట్ చేశాడు. ఈ సినిమాతో కలిపి మొత్తం నాని నటించిన తొమ్మిది సినిమాలు ఈ ఘనతను అందుకోవడం విశేషం. ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకున్న నాని ప్రస్తుతం 'సరిపోదా శనివారం' అనే సినిమా చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుటోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : ‘డెవిల్‘ వివాదం - ఆ మూవీ కోసం మూడేళ్లు కష్టపడ్డా, ఎప్పటికీ నేనే దర్శకుడిని: నవీన్ మేడారం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget