Tatineni Rama Rao - Balakrishna: నిర్మాతకు రూపాయి మిగలాలని ఆలోచించే దర్శకుడు - తాతినేని మృతిపై బాలకృష్ణ సంతాపం
సీనియర్ దర్శకులు తాతినేని రామారావు మృతి పట్ల ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు.
Tatineni Rama Rao Is No More: "దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చిన తాతినేని రామారావు (Tatineni Rama Rao) గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన మరణ వార్త నన్ను ఎంతగానో కలచివేసింది" అని ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. తాతినేని రామారావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాతినేని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాతినేని రామారావు మరణం (Tatineni Rama Rao Death) చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ఆయనతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "తాతినేని రామారావు గారు అద్భుతమైన దర్శకులు. నాన్నగారి (Nandamuri Taraka Rama Rao) తో చరిత్రలో నిలిచిపోయే 'యమగోల' లాంటి విజయవంతమైన సినిమా తీశారు. మేటి దర్శకులుగా నిలిచారు" అని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా 'యమగోల'తో పాటు 'అనురాగ దేవత', 'ఆటగాడు' చిత్రాలకు తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. ఆ మూడు చిత్రాలూ వంద రోజులు ఆడాయి. (Yamagola Movie Director Tatineni Rama Rao Passes Away)
Also Read: ఎన్టీఆర్ 'యమగోల' దర్శకుడు తాతినేని రామారావు మృతి
తాతినేని రామారావు దర్శకత్వంలో బాలకృష్ణ కూడా కథానాయకుడిగా నటించారు. ఆ సినిమా 'తల్లిదండ్రులు' (Balakrishna Movie with Tatineni Rama Rao). అది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిందని బాలకృష్ణ గుర్తు చేశారు. తాతినేని రామారావు నిర్మాతల దర్శకుడని బాలకృష్ణ కొనియాడారు. "నిర్మాత పక్షాన నిలబడి, నిర్మాతకు ఒక రూపాయి మిగలాలని ఆలోచిస్తూ... అదే సమయంలో చిత్ర నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా చిత్రాలు తీసే ప్రతిభ తాతినేని రామారావు గారి సొంతం. హిందీలో విజయవంతమైన చిత్రాలు తీసి, అక్కడ కూడా హిట్ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు" అని బాలకృష్ణ అన్నారు. (Tatineni Rama Rao is producers director, says Hero Nandamuri Balakrishna)
Also Read: మంగళ సూత్రం ఏది? నుదుట సింధూరం ఎక్కడ? - ఆలియాపై ట్రోలింగ్ షురూ
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.