అన్వేషించండి

Nagarjuna: నాన్నగారు నా మనసులో చెప్పిన మాటను నిజం చేశాను - ‘నా సామిరంగ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున

Naa Saami Ranga Pre Release Event: జనవరి 14న ‘నా సామిరంగ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నాగార్జున. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా చేయడానికి కారణాన్ని బయటపెట్టారు నాగ్.

Nagarjuna at Naa Saami Ranga Pre Release Event: సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. ఈసారి పండగకు నాలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఒకదానితో పోటీ పడుతూ మరొకటి ప్రమోషన్స్ కూడా చేస్తున్నాయి. ఇక తాజాగా ‘నా సామిరంగ’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. జనవరి 14న విడుదల కానున్న ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని నాగార్జున నమ్మకంతో ఉన్నారు. అందుకే ఈ ఈవెంట్‌లో టెక్నీషియన్ల గురించి, కో స్టార్ల గురించి మాట్లాడనని.. సక్సెస్ మీట్‌లోనే మాట్లాడతానని తెలిపారు. ఎప్పుడూ వెన్నంటే ఉంటూ ‘నా సామిరంగ’ టీమ్‌ను ప్రోత్సహించిన కీరవాణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకున్నారు.

కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీస్ కొడుతున్నాడు..
మూడు నెలల్లో ‘నా సామిరంగ’ షూటింగ్‌ను పూర్తి చేశామని, అంత తక్కువ సమయంలో సినిమా తీయడం అంత ఈజీ కాదని అన్నారు నాగార్జున. అంతే కాకుండా ఈ మూడు నెలల్లో అందరం ఫ్యామిలీ అయిపోయామని అన్నారు. జనవరి 14కే ఈ కష్టం ఫలించిందా లేదా తెలుస్తుందని తెలిపారు. ‘‘సెప్టెంబర్ 20 నాన్నగారి పుట్టినరోజున.. ఆయనకు వందేళ్లు వచ్చినరోజున.. ఆయన విగ్రహం ఆవిష్కరించినప్పుడు.. ఆయనకు దండం పెట్టుకున్నప్పుడు.. ఆయన నా మనసులో చెప్పిన మాట ఇది. వెళ్లి చేయరా సినిమా. నా సామిరంగ అన్నారు. ఆయన చెప్పిన ధైర్యంతోనే ఇలాగే పూర్తిచేశాం సినిమా. సంక్రాంతి పండగకు అక్కినేని అభిమానులకు ఒక మాట చెప్పాలి. ఈసారి పండగకు కిష్టయ్య వస్తున్నాడు. బాక్సాఫీస్ కొడుతున్నాడు’’ అని తన సినిమా హిట్‌పై ధీమా వ్యక్తం చేశారు నాగార్జున.

సినిమాలు చూడరు అన్నారు..
ఈసారి సంక్రాంతికి ‘నా సామిరంగ’తో పాటు మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జా ‘హనుమాన్’, వెంకటేశ్ ‘సైంధవ్’ కూడా రిలీజ్ ఉన్నాయని గుర్తుచేసుకున్న నాగార్జున... అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒకప్పటి నుండి ఇప్పటివరకు సినిమాలు చూసే విధానం ఎలా మారిందని కామెంట్స్ చేశారు. ‘‘టీవీలు రాగానే సినిమాలు అయిపోయాయి. ఎవరూ చూడరు అన్నారు. ఫోన్లు వచ్చాయి, డిజిటల్ వచ్చింది, ఈమధ్య ఓటీటీ అనేది ఒక వచ్చింది. సినిమాలు చూడరు అన్నా సినిమాలు చూస్తూనే ఉన్నారు. సంక్రాంతి పండగకు సినిమా చూడడం తెలుగువారి ఆనవాయితీ. నాలుగు సినిమాలు వచ్చినా చూస్తారు’’ అంటూ ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు ఆడాలని కోరుకున్నారు.

కీరవాణి సినిమాకు స్టార్..
ఇంతకు ముందు కూడా రెండు సినిమాలతో రెండుసార్లు సంక్రాంతి రేసులో నిలబడ్డారు నాగార్జున. ఆ రెండుసార్లు కూడా ఇతర చిత్రాల నుండి ఎంత పోటీ ఉన్నా... తను నటించిన సినిమాలు మాత్రం మంచి హిట్‌ను అందుకున్నాయి. ఇక ‘నా సామిరంగ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నారు నాగ్. ‘‘మీకు మేము ఇచ్చే సినిమా నచ్చితే మీరు ఎంత ఆదరిస్తారో రెండు పండగలు చూశాను. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అని అన్నారు. ఈ సినిమాకు స్టార్ కీరవాణి అని, షూటింగ్ త్వరగా పూర్తిచేయడానికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహం ముఖ్య కారణమని బయటపెట్టారు నాగార్జున. కొత్త దర్శకుడు అయిన విజయ్ బిన్నీని కీరవాణి, చంద్రబోస్ కలిసి చాలా ప్రోత్సహించారని తెలిపారు.

Also Read: సంక్రాంతి సినిమాల టికెట్ రేట్స్ - ఏ మూవీకి ఎంత? ఏ స్టేట్‌లో ఎంత?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget