Nagababu Comments On YCP: 'ఆర్ఆర్ఆర్'లో కోడి కత్తి, ఖైదీ సీఎం - నాగబాబు వెటకారం! వైఎస్ వివేకాది సహజ మరణమా?

ఏపీలో అధికారం ఉన్న వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, ఇంకా మంత్రులపై ఇన్‌స్టాగ్రామ్‌లో నాగబాబు విరుచుకుపడ్డారు. ఖైదీ సీఎం అంటూ కామెంట్ చేయడం విశేషం.

FOLLOW US: 

మెగా బ్రదర్ నాగబాబు మళ్ళీ మొదలుపెట్టారు. ఆయనలోని మీమ్ మేకర్‌ను మళ్ళీ బయటకు తీశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తనదైన శైలిలో ప్రత్యర్థులపై విమర్శల బాణాలు సంధించారు. వ్యంగ్య ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. 'ఇక మొదలెడదామా!' అంటూ సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. మొదట మంచు మనోజ్ మీద పరోక్షంగా విమర్శలు సంధించినా... ఆ తర్వాత వైసీపీ (వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ) మీదకు ప్రశ్నలు వెళ్లాయి. కోడి కత్తితో పాటు ఏపీలో క్యాసినో నిర్వహణ, లిక్కర్ బ్రాండ్స్ ప్రస్తావన తీసుకొస్తూ... ఆయన సమాధానాలు ఇవ్వడం గమనించదగ్గ అంశం. ఇంతకీ నాగబాబుకు ఎదురైన ప్రశ్నలు ఏమిటి? ఆయన ఇచ్చిన సమాధానాలు ఏమిటి? ఒక్కసారి చూస్తే...

'ఆర్ఆర్ఆర్'లో రాజమౌళి ఏం కత్తి వాడుతున్నారు సార్?
నాగబాబు: కోడి కత్తి! (డైరెక్టుగా చెప్పకుండా కోడి కత్తి ఫొటో పోస్ట్ చేశారు)

'ఆర్ఆర్ఆర్'ను ఫ్రీగా చూడాలంటే ఎలా?
నాగబాబు: ఎందుకు చూడలేం? చూడొచ్చు... చరణ్ బదులు నాని (పేర్ని నాని?), ఎన్టీఆర్ బదులు శ్రీనివాస్ (అవంతి శ్రీనివాస్?), ఇక దర్శకుడు ఎవరో మీకు చెప్పక్కర్లేదు!

కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశాక మీ అభిప్రాయం?
నాగబాబు: ఆంధ్రా మూడు రాజధానులు ఫైల్స్ అని ఒక సినిమా తీస్తే చూడాలని ఉంది. 
Also Read: థియేట‌ర్ల‌లో ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ఎదురులేదు. మ‌రి, ఓటీటీల్లో? - ఈ వారం విడుదలవుతున్న చిత్రాలు ఇవే

పోలీస్ కేసులు ఉంటే రాజకీయాల్లో సీట్లు వస్తాయా?
నాగబాబు: ఖైదీలు ముఖ్యమంత్రులు అయిన దేశంలో పోలీస్ కేసులు ఒక లెక్కా?

సామాన్యుడు కోసం తగ్గించాం అన్నారు, ఇప్పుడు పెంచారు (సినిమా టికెట్ రేట్స్). ఈ ప్రభుత్వం ఏంటి?
నాగబాబు: మీరేంటో, మీ విధానాలు ఏంటో నాకు అర్థం కావు (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో రెస్టారెంట్ సన్నివేశంలో రావు రమేష్ వీడియో పోస్ట్ చేశారు). 

సహజ మరణం అంటే ఏంటి?
నాగబాబు: కల్తీ సారా తాగి చనిపోవడం, కత్తులతో గొడ్డలితో గాయపడి చనిపోవడం, పంటలు పండక పురుగుల మందు తాగి చనిపోవడం, గతుకుల రోడ్డు వల్ల ప్రమాదాలు జరిగి చనిపోవడం (సీయం జగన్ వ్యాఖ్యలు, వైఎస్ వివేకా హత్య, ఏపీలో పరిస్థితులపై సీరియస్ కామెంట్ ఇది). 

Also Read: నో కామెంట్స్, చెప్పను బ్రదర్! - మంచు మనోజ్ వర్సెస్ నాగబాబు

పోర్న్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి?
నాగబాబు: పబ్లిక్ లో ఇవి మాట్లాడటానికి నాకు ఇబ్బందిగా ఉన్నా... ఈ మధ్య నాకొక రాజకీయ నాయకుడు గుర్తు వస్తాడు (కొంత మంది రాజకీయ నాయకుల ఫోన్ కాల్ రికార్డింగులు లీకైన సంగతి తెలిసిందే. వాళ్ళను ఉద్దేశిస్తూ కామెంట్ చేసినట్టు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు). 

మన ముఖ్యమంత్రి పాలన బాగుందంట నిజమేనా?
నాగబాబు: నువ్వు ఈ క్వశ్చన్ నన్ను నిజంగానే అడుగుతున్నావా రాధికా? (డీజే టిల్లు సినిమాలో వీడియో పోస్ట్ చేశారు)

కాకినాడ మడతకాజా కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఏమై ఉంటుంది?
నాగబాబు: కుక్క కరించింది అనే అర్థం వచ్చేలా ఒక ఫొటో పోస్ట్ చేశారు. 

గోవాలో క్యాసినో బావుంటుంది!
నాగబాబు: అక్కడేమో నాకు తెలియదు. కానీ, ఈ మధ్య మన ఏపీలో స్టార్ట్ అయ్యిందని విన్నాను.

ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ మెడల్ ఉంది కదా? అలాగే, పద్మశ్రీ బ్రాండ్ ఉంటుందా?
నాగబాబు: ఈ ఫొటో పోస్ట్ చేశారు. 

ఒక్క ఛాన్స్ గురించి మీ అభిప్రాయం?
నాగబాబు: ఇచ్చినందుకు బాగా దింపారుగా!

వైసీపీలో మిస్టర్ పర్ఫెక్ట్ పొలిటిషన్ ఎవరైనా ఉన్నారా?
నాగబాబు: ఈ ఫొటో పోస్ట్ చేశారు.

Also Read: రాజమౌళి అనవసరంగా 15 టేకులు చేయించాడా?

Published at : 22 Mar 2022 11:30 AM (IST) Tags: ap govt ys vivekananda reddy YS Jagan Mohan Reddy nagababu Nagababu Comments On YCP Nagababu Comments On YS Vivekananda Reddy Death Nagababu Setairs On YS Jagan Nagababu Setairs On AP Govt

సంబంధిత కథనాలు

అయ్యో సుమా, ఈ వయసులో ఇదంతా అవసరమా, ప్రగతిలా ట్రై చేస్తే? భర్తతో శ్రీయా లిప్‌లాక్!

అయ్యో సుమా, ఈ వయసులో ఇదంతా అవసరమా, ప్రగతిలా ట్రై చేస్తే? భర్తతో శ్రీయా లిప్‌లాక్!

Pakka Commercial: గోపీచంద్ హిట్ కొట్టాల్సిందే - లేదంటే!

Pakka Commercial: గోపీచంద్ హిట్ కొట్టాల్సిందే - లేదంటే!

Devi Sri Prasad: దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ సల్మాన్ కి నచ్చలేదా? ప్రాజెక్ట్ నుంచి అవుట్!

Devi Sri Prasad: దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ సల్మాన్ కి నచ్చలేదా? ప్రాజెక్ట్ నుంచి అవుట్!

Samantha: పోటీ నుంచి తప్పుకుంటున్న సమంత - త్వరలోనే క్లారిటీ?

Samantha: పోటీ నుంచి తప్పుకుంటున్న సమంత - త్వరలోనే క్లారిటీ?

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

టాప్ స్టోరీస్

GPF Money Moved To Pensions : ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ములు సామాజిక పెన్షన్లకు మళ్లించారా ?

GPF Money Moved To Pensions : ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ములు సామాజిక పెన్షన్లకు మళ్లించారా ?

IND Vs ENG Squads: ఇంగ్లండ్ వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!

IND Vs ENG Squads: ఇంగ్లండ్ వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!

Eknath Shinde: 'ఉద్ధవ్ ఠాక్రేకు ఎన్నో సార్లు చెప్పాను- ఆయన సైనికుడ్ని భాజపా సీఎం చేస్తుంది'

Eknath Shinde: 'ఉద్ధవ్ ఠాక్రేకు ఎన్నో సార్లు చెప్పాను- ఆయన సైనికుడ్ని భాజపా సీఎం చేస్తుంది'

AP Weekly Five Days : వారానికి ఐదు రోజులే పని - మరో ఏడాది పొడిగించిన ఏపీ ప్రభుత్వం !

AP Weekly Five Days : వారానికి ఐదు రోజులే పని - మరో ఏడాది పొడిగించిన ఏపీ ప్రభుత్వం !