RRR Update - Naatu Naatu Song: రాజమౌళి అనవసరంగా 15 టేకులు చేయించాడా?
Rajamouli okays 2nd take for Naatu Naatu Song: 'నాటు నాటు...' సాంగ్ కోసం 17, 18 టేకులు చేశామని ఎన్టీఆర్, రామ్ చరణ్, 'ఆర్ఆర్ఆర్' టీమ్ సభ్యులు చెప్పారు. మరి, రాజమౌళి ఏ టెక్ ఓకే చేశారో తెలుసా?
NTR and Ram Charan did 17 to 18 takes for Naatu Naatu Song. But, Rajamouli okays second take: 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి విడుదలైన స్టిల్స్, టీజర్స్, ట్రైలర్స్ అన్నీ ఒక ఎత్తు! 'నాటు నాటు...' సాంగ్ మరో ఎత్తు! అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు, ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు కిక్ ఇచ్చిన సాంగ్ అది. ఎన్టీఆర్, చరణ్ వేసిన స్టెప్స్ హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా ఇద్దరూ సింక్‌లో వేసిన స్టెప్ అయితే అందరికీ విపరీతంగా నచ్చేసింది. ఆ స్టెప్ వెనుక ఆసక్తికరమైన విషయం యాంకర్ సుమ కనకాలకు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటకు వచ్చింది.
Interesting fact behind Naatu Naatu song - RRR Movie: 'నాటు నాటు...' సాంగ్‌ను ఉక్రెయిన్‌లో షూట్ చేశారు. హీరోలు ఇద్దరినీ ఒక వారం ముందే అక్కడికి పంపించిన రాజమౌళి, వాళ్ళిద్దరి చేత ప్రాక్టీస్ చేయించారు. తర్వాత షూటింగ్ చేశారు. ఉక్రెయిన్‌లో తమ చేత 17, 18 టేక్స్ చేయించారని... ప్రతి ఫ్రేమ్ పాజ్ చేసి మరీ రాజమౌళి చూశాడని హీరోలు గతంలోనే చెప్పుకొచ్చారు. అన్ని టేక్స్ చేస్తే... రాజమౌళి సెకండ్ టేక్ ఓకే చేశారని రామ్ చరణ్ చెప్పారు. 'అన్ని టేక్స్ ఎందుకు చేయించారు?' అని రాజమౌళిని ఎన్టీఆర్ ప్రశ్నిస్తే... 'మీరు బాగా చేస్తారు అనుకున్నాం అండీ' అని దర్శక ధీరుడు సరదాగా సమాధానం ఇచ్చారు. ఎడిటింగ్ రూమ్‌లో టేక్స్ అన్నీ చూసినప్పుడు రాజమౌళికి రెండో టేక్ నచ్చిందట. అదే ఓకే చేశారట. మరి, మిగతా 15 టేక్స్ వేస్ట్ అయినట్టేనా? అంటే... 'అవును' అనుకోవాలి ఏమో!
Also Read: ఇండియన్ సినిమాపై రాజముద్ర - దేశం గర్వించే స్థాయికి చేరిన ఎస్ఎస్ రాజమౌళి!
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాను రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించారు. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎన్టీఆర్ జోడిగా ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ జంటగా ఆలియా భట్ నటించారు. అజయ్ దేవగణ్, శ్రియ, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.