Nabha Natesh-Priyadarshi: నెటిజన్స్ చెవిలో పువ్వులు పెట్టిన నభా నటేష్, ప్రియదర్శి - వారి గొడవ అందుకేనట!
హాట్ బ్యూటీ నభా నటేష్, తెలంగాణ పిల్లాడు ప్రియదర్శి మధ్యన జరిగిన ‘డార్లింగ్’ లొల్లి వెనుక అసలు కథ బయటకు వచ్చింది. సినిమా ప్రమోషన్ లో భాగంగానే వీరిద్దరు గొడవ పడినట్లు తేలింది.
Nabha Natesh, Priyadarshi 'Darling' fight: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో నటుడు ప్రియదర్శి, నటి నభా నటేష్ మధ్య ‘డార్లింగ్’ పంచాయితీ కొనసాగుతోంది. బుధవారం మొదలైన ఈ పంచాయితీ ఇంకాసాగుతూనే ఉంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఆయా సినిమా ఈవెంట్లలో ‘డార్లింగ్’ అంటూ మాట్లాడిన మాటలను కలిపి నభా తాజాగా ఫన్నీగా ఓ రీల్ చేసింది. సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. కొద్ది సేపట్లోనే బాగా వైరల్ అయ్యింది. ఈ రీల్ పై యంగ్ హీరో ప్రియదర్శి స్పందించాడు. “డార్లింగ్ అదరగొట్టేశావ్” అంటూ కామెంట్ పెట్టాడు. ఈ మాటతో నభాకు కోపం తన్నుకొచ్చింది. “ఏయ్ మిస్టర్.. జాగ్రత్తగా మాట్లాడు. డార్లింగ్ అని పిలవడం నేరం. లైంగిక వేధింపుల కిందికి వస్తుంది తెలుసా?” అంటూ రిప్లై ఇచ్చింది. ఈ రిప్లైకి ప్రియదర్శి మళ్లీ రియాక్ట్ అయ్యాడు. “అవునా.. నువ్వెప్పుడు నాకు తెలియని వ్యక్తివి అయ్యావ్” అని కామెంట్ చేశాడు. వీరిద్దరి గొడవ సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.
నభా నటేష్, ప్రియదర్శి- మధ్యలో రీతూ!
తాజాగా ఇద్దరి మధ్య గొడవలోకి మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. “నా కామెంట్స్ సెక్షన్‌లో మీ పంచాయితీ ఏంటి?” అంటూ రీతూ వర్మ ఘాటుగా స్పందించింది. రీతూ వర్మ రీసెంట్ గా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసి ప్రియదర్శి “వావ్ రీతూ డార్లింగ్.. ఎంత అందంగా ఉన్నావో? నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావట్లేదు” అని కామెంట్ చేశాడు. “బాబోయ్ ఇతడు మళ్లీ మొదలు పెట్టాడు. అందరినీ డార్లింగ్ అని పిలవడం ఏంటి? బ్రెయిన్ పని చేయట్లేదా? అని కోప్పడింది. “నేను ఎవరినో డార్లింగ్ అని పిలిస్తే నీకెందుకు బాధ?” అంటూ కామెంట్ పెట్టాడు. వీరిద్దరి కామెంట్స్ పై రీతూవర్మ స్పందించింది. “నా కామెంట్ సెక్షన్ లో మీ పంచాయితీ ఏంటి?” అసహనం వ్యక్తం చేసింది.
Rey Em Jaruguthundhi ra Veella Madya 🫣#WhyThisKolaveri ? Any Thing Interlinked pic.twitter.com/R0PjCmKlXD
— Movies4u Official (@Movies4u_Officl) April 18, 2024
‘డార్లింగ్’ సినిమా గురించే ఈ కాంట్రవర్సీ!
అయితే, ఈ పంచాయితీ అంతా ప్రియదర్శి, నభా నటేష్ కలిసి నటించబోతున్న’డార్లింగ్’ అనే సినిమా గురించేననే టాక్ వినిపిస్తోంది. తమిళ దర్శకుడు అశ్విన్ రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకే నభా నటేష్, ప్రియదర్శి ‘డార్లింగ్’ గొడవకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రీతూ వర్మ కూడా నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే బయటకు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రియదర్శి ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నాడు. ‘బలగం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన, రీసెంట్ గా ‘ఓం భీమ్ బుష్’ తో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక ‘సేవ్ ది టైగర్స్ 2’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అటు నభా నటేష్ ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్వయంభు’ సినిమాలో నటిస్తున్నది.
Read Also: నేను మంచోడిలా కనిపిస్తాను. కానీ, కాదు - శర్వానంద్ ‘మనమే‘ టీజర్ చూశారా?