Maname Movie Teaser: నేను మంచోడిలా కనిపిస్తాను. కానీ, కాదు - శర్వానంద్ ‘మనమే‘ టీజర్ చూశారా?
‘ఒకే ఒక జీవితం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శర్వానంద్ తాజాగా ‘మనమే’ అనే సినిమా చేస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి టీజర్ తాజాగా విడుదలైంది.
Maname Movie Teaser Out: తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్.. ఫీల్ గుడ్ మూవీస్ చేయడంలో ముందుంటాడు. ఆయన సినిమాలన్నీ ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యూత్ ను బాగా ఆకట్టుకుంటాయి. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ సెంటిమెంట్ తో ప్రేక్షకులను అలరిస్తాడు. శర్వానంద్ చివరగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో కనిపించాడు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆయన ‘మనమే’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య తనయుడు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు.
ఆకట్టుకుంటున్న ‘మనమే’ టీజర్
ఇప్పటికే ‘మనమే’ సినిమా నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం నుంచి ఓ పాటను కూడా విడుదల చేశారు. ఈ సాంగ్ సినీ అభిమానులను అలరించింది. సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. ఈ ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగేలా తాజాగా మూవీ నుంచి చిత్రబృందం టీజర్ విడుదల చేసింది. ఈ టీజర్ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంటోంది. చక్కగా ప్లజెంట్ గా, కలర్ ఫుల్‌గా ఆహా అనిపిస్తోంది.
“నేను మంచోడిలా కనిపిస్తాను. కానీ, మంచోడిని కాదు” అనే శర్వానంద్ డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభం అవుతుంది. హీరోయిన్ కృతి ఇచ్చిన మాట మీద నిలబడుతుంది. శర్వానంద్ మాత్రం తన మాట మీద నిలబడడు. ఇద్దరు పూర్తి విరుద్ధమైన క్యారెక్టర్లతో కనిపించారు. వీరిద్దరి మధ్య నడిచే కథే ఈ సినిమా. ఇక ఈ చిత్రం లండన్‌లో నడుస్తున్నట్లు అర్థం అవుతోంది. అనుకోకుండా హీరో, హీరోయిన్ జీవితంలోకి ఓ బాబు వస్తే ఎలా ఉంటుంది? ఇంతకీ ఆ బాబుకు వీరికి ఏమైనా సంబంధం ఉందా? అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ టీజర్ లో హీరో లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం!
‘మనమే’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. త్వరగా షూట్ కంప్లీట్ చేసి వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా డిఫరెంట్ లవ్ స్టోరీతో శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఇచ్చిన బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్ లో ఉంది. విజువల్స్ ను మరింత రిచ్ గా ఎలివేట్ చేస్తోంది. మొత్తంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ అందరినీ థియేటర్లకు రప్పించడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోన్న 35వ చిత్రం కావడం విశేషం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?