అన్వేషించండి

Pushpa 2: "కిస్సిక్" సాంగ్ ఆఫ్ ది ఇయర్ - "పుష్ప 2" స్పెషల్ సాంగ్ అప్డేట్ - టీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్

Kissik From Pushpa 2 The Rule: "కిస్సిక్" సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ "పుష్ప 2" స్పెషల్ సాంగ్ అప్డేట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్/ట్విట్టర్‌లో స్పెషల్ పోస్ట్ చేసింది.

Pushpa 2 The Rule: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం 'పుష్ప ది రూల్'. ఇండియాలోనే ఇప్పుడు మోస్ట్ అవెయిటింగ్ మూవీ ఏదైనా ఉంది అంటే అది 'పుష్ప2' నే. ఇక ప్రస్తుతం అందరూ ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ క్రేజీ అప్డేట్ ను ఇచ్చి ప్రేక్షకులను ఊరించింది. 

అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'పుష్ప' సినిమాకు సీక్వెల్ గా రాబోతోంది 'పుష్ప : ది రూల్'. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి భారీ ఎత్తున రాబోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది ఒక్క స్పెషల్ సాంగ్ తప్ప. గత కొంతకాలంగా సెకండ్ పార్ట్ లో స్పెషల్ సాంగ్ చేయబోయేది ఎవరు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు సమంత మళ్ళీ అల్లు అర్జున్ తో కలిసి స్పెషల్ సాంగ్ చేయబోతోంది అనే రూమర్లు వినిపిస్తుండగా, మరోవైపు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తో ఐటమ్ సాంగ్ చేయించబోతున్నారు అని పుకార్లు షికార్లు చేశాయి. కానీ శ్రద్ధా కపూర్ ఈ సాంగ్ కోసం భారీ మొత్తంలో పారితోషకం డిమాండ్ చేయడంతో ఎట్టకేలకు టాలీవుడ్ బ్యూటీ శ్రీలీలను ఈ సాంగ్ కోసం తీసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ దీనికి సంబంధించి ఓ స్పెషల్ పోస్ట్ చేశారు.

Also Read: హీరోయిన్ లేకుండానే తెరపైకి రాబోతున్న "మ్యాడ్ స్క్వేర్".. కానీ టిల్లు గానీ పిల్లది మాత్రం స్పెషల్ రోల్

"కిస్సిక్" అని సాంగ్ పేరును రివీల్ చేస్తూ, 'ఇది సాంగ్ ఆఫ్ ది ఇయర్ కాబోతోంది' అంటూ మరింత క్యూరియాసిటీని పెంచారు. మైత్రి చేసిన ఈ పోస్ట్ తో అందరూ అల్లు అర్జున్ తో తెరపై శ్రీ లీల వేయబోయే అదిరిపోయే స్టెప్పులు చూడాలని మరింత ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఇక అల్లు అర్జున్ అభిమానులు ఈ పాట చార్ట్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఫస్ట్ పార్ట్ లో సమంత చేసిన "ఊ అంటావా మావా ఉఊ అంటావా మావా" సాంగ్ సంగీత ప్రియులను ఊపేసిన సంగతి తెలిసిందే. సమంత ఆ సాంగ్ లో నటించడం ఒక స్పెషల్ ఎట్రాక్షన్ కాగా, సినిమాలోని మెయిన్ హైలెట్స్ లో ఈ పాట కూడా ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే 'పుష్ప 2'లో రానున్న ఐటమ్ సాంగ్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సాంగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుందా? సమంత ప్లేస్ ను శ్రీలీల రీప్లేస్ చేయగలదా? అనే చర్చ నడుస్తోంది ఇండస్ట్రీలో. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు ఒక పాట కూడా ఆకట్టుకుంది. మరి మేకర్స్ ఈ సాంగ్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో? పాటలో ఉన్న "కిస్సిక్" అనే పదానికి అర్థం ఏంటో ఎప్పుడు చెప్తారో చూడాలి.

 

Read Also: ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ ఫోటో లీక్ - అల్లు అర్జున్ తో శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Embed widget