అన్వేషించండి

Mufasa The Lion King Telugu: అప్పుడు చిరుకి విలన్, ఇప్పుడు మహేష్‌కి విలన్... సూపర్ స్టార్ వన్ లైనర్స్‌పై సత్యదేవ్ కామెంట్స్

చిరంజీవికి విలన్‌గా నటించిన యంగ్ హీరో సత్యదేవ్ ఇప్పుడు మహేష్ కి విలన్ గా చేస్తున్నారు. 'ముఫాసా: ది లయన్ కింగ్' సినిమాలో సూపర్ స్టార్ వన్ లైనర్ల గురించి సత్యదేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఎంతోమంది నటీనటుల కల. కానీ ఇప్పటి యంగ్ తరం హీరోలలో ఆ అదృష్టం ఒక్క సత్య దేవ్ కి మాత్రమే దక్కింది. ఆయన ఇంతకుముందు చిరంజీవికి విలన్ గా చేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు విలన్ గా చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సత్యదేవ్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

డాలీ ధనుంజయ, సత్యదేవ్ హీరోలుగా... ప్రియ భవాని శంకర్, జెనీఫర్ పిక్కీనాటో హీరోయిన్ గా నటించిన క్రైమ్ ఎంటర్టైనర్ "జీబ్రా". ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం కలిసి నిర్మించిన ఈ మూవీ ఈనెల 22న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సత్యదేవ్ మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. అందులో ఆయన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ డబ్బింగ్ చెప్పిన పాత్రకు విలన్‌ రోల్‌కు తాను డబ్బింగ్ చెప్పడం గురించి ఆయన మాట్లాడారు. 

'ముఫాసా : ది లయన్ కింగ్' మూవీలో సత్యదేవ్ కూడా భాగమైన విషయం తెలిసిందే. డిస్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీని ఇండియాలోని పలు భాషల్లో, డిసెంబర్ 20న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో హీరో ముఫాసా పాత్రకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందిస్తుండగా... పుంబా అనే ముఖ్యమైన పాత్రకు బ్రహ్మానందం, టైమోన్ పాత్రకు అలీ, కీరోస్ పాత్రకు అయ్యప్ప పి శర్మ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అలాగే సత్యదేవ్ టాకా అనే పాత్రకు ఇందులో డబ్బింగ్ చెప్తున్నారు.

సినిమాలో మహేష్ బాబు పాత్ర ముఫాసా, సత్యదేవ్ పాత్ర టాకా ఇద్దరూ అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య విభేదాల నేపథ్యంలో సినిమా సాగుతుందని, మహేష్ బాబుకు ఆపోజిట్ గా డబ్బింగ్ చెప్పడం అనేది మంచి ఎక్స్పీరియన్స్ ని ఇచ్చిందని తాజా ఇంటర్వ్యూలో సత్యదేవ్ వెల్లడించారు. అంతే కాకుండా సినిమాలో మహేష్ వన్ లైనర్లు అద్భుతంగా ఉంటాయని చెప్పి మరింత ఆసక్తిని పెంచారు. ఇక సత్యదేవ్ గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'గాడ్ ఫాదర్' మూవీలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడేమో 'ముఫాసా'లో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెబుతున్న పాత్రకు ఆపోజిట్ గా ఉండే పాత్రలో, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రకు డబ్బింగ్ చెప్పి అదరగొట్టబోతున్నారు. మరి థియేటర్లలో వీరిద్దరి మధ్య జరిగే వార్ ఎలా ఉంటుందో చూడాలి. 

ఇదిలా ఉండగా "ముఫాసా : ది లయన్ కింగ్" మూవీ రిలీజ్ కి ఇంకా నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో 'న్యూ రోర్' అంటూ ఒక కొత్త పోస్ట్ ను షేర్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా మూవీ రిలీజ్ కి ఇంకా కేవలం నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ మూవీ గురించి ఇప్పుడు మహేష్ అభిమానులతో పాటు హాలీవుడ్ మూవీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో కూడా ర్'ముఫాస' రిలీజ్ అవుతుండడంతో, దీన్ని థియేటర్లలో చూడడానికి చిన్న పిల్లలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Read Also: వేణు ఉడుగుల నిర్మాణంలో మట్టి పరిమళాల కురిపించే ప్రేమ కథ... తండేల్ వచ్చిన వెంటనే థియేటర్లలోకి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Balagam Mogilaiah: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Look Back 2024: అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
Jammu And Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌, ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం  
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌, ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం  
Embed widget