By: ABP Desam | Updated at : 12 May 2022 05:26 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సర్కారు వారి పాటపై ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్
Vijaysai Reddy On SVP : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా గురువారం విడుదల అయింది. మహేశ్ బాబు యాక్షన్, డైలాగ్ డెలవరీతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. సినిమాపై ప్రశంసలు కురించారు. సమకాలీన అంశాలతో సాగిన సందేశాత్మక చిత్రం సర్కారు వారి పాట బాగుందని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంకులు చూపే తేడాను బాగా ఆవిష్కరించారని ప్రశంసలు కురిపించారు.
సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 12, 2022
All the best to #MaheshBabu #wishes #greetings.
Superstar @urstrulyMahesh delivered a superb and energetic performance with fantastic comic timing in #SarkaruVaariPaata
Congratulations to the entire team. — Raghavendra Rao K (@Ragavendraraoba) May 12, 2022
సర్కారు వారి పాట ఓటీటీ రైట్స్ ఎవరికంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సర్కారు వారి పాట' ఓటీటీ రైట్స్‌ను దిగ్గజ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు విడుదలైన సంగతి తెలిసిందే. డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ప్రైమ్ వీడియో అని థియేటర్లలో ప్రదర్శించారు. ఓటీటీలో 'సర్కారు వారి పాట' ఎప్పుడు విడుదల అవుతుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు 'ఆర్ఆర్ఆర్' ఓటీటీలో విడుదల అవుతోంది. మరోవైపు, 'రాధే శ్యామ్' థియేటర్లలో విడుదలైన 20 రోజులకు వచ్చింది. థియేట్రికల్ రన్ మీద ఓటీటీ రిలీజ్ ఆధారపడి ఉంటుంది. శాటిలైట్ రైట్స్ విషయానికి వస్తే... 'సర్కారు వారి పాట' స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుంది. అదీ ఓటీటీలో విడుదలైన తర్వాతే! ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది. ఆ ఛానల్ లోగో కూడా 'సర్కారు వారి పాట' టైటిల్ కార్డ్స్‌లో పడింది. సినిమాలో కొత్త మహేష్ బాబు కనిపించారని విమర్శలు, ప్రేక్షకులు చెబుతున్నారు. థియేటర్ల దగ్గర సినిమాకు వస్తున్న స్పందనపై నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.
NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు
Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!
COOKIES_POLICY