Chiru Bobby Movie: చిరంజీవి - బాబీ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా Mirai డైరెక్టర్...
Karthik Gattamneni On Chiru - Bobby Movie: 'మిరాయ్'తో దర్శకుడుగా కార్తీక్ ఘట్టమనేని విజయం సాధించారు. ఆయన పని తీరు మీద ప్రశంసలు వస్తున్నాయి. చిరంజీవి బాబి సినిమాకు ఆయన వర్క్ చేయనున్నారు.

'మిరాయ్'తో దర్శకుడిగా కార్తీక్ ఘట్టమనేని భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. దీనికి ముందు మాస్ మహారాజా రవితేజ హీరోగా 'ఈగల్' తీశారాయన. టెక్నికల్ పరంగా ఆ చిత్రానికి మంచి పేరు వచ్చిన కమర్షియల్ పరంగా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ చిత్రానికి ముందు తీసిన సూర్య వర్సెస్ సూర్య కూడా ప్రశంసలు తెచ్చింది కానీ భారీ వసూళ్లు తేలేదు ఇప్పుడు ఆ లోటును మిరాయి తీర్చింది మరి ఈ విజయం తర్వాత కార్తీక్ ఘట్టమనేని ఏం చేయబోతున్నారో తెలుసా?
చిరంజీవి బాబీ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఆయన వీరాభిమాని బాబి కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య విజయం తర్వాత మరోసారి వాళ్ళిద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఆ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని పని చేయనున్నారు.
బాబీ దర్శకత్వం వహిస్తున్నారు కదా! మరి కార్తీక్ ఘట్టమనేని ఏం చేస్తారు? అని కొందరికి సందేహం రావచ్చు. దర్శకుడు కాకముందు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. 'ప్రేమ ఇష్క్ కాదల్', 'కార్తికేయ', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'ప్రేమమ్', 'నిన్ను కోరి', 'చిత్రలహరి', 'డిస్కో రాజా', 'కార్తికేయ 2' తదితర సినిమాలకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. ఇప్పుడు చిరు - బాబీ సినిమాకు కూడా ఆయన కెమెరా వర్క్ చేయనున్నారు.
తమిళంలో దళపతి విజయ్ 'జన నాయకన్', రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్' వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్, ఈ మెగా ప్రతిష్టాత్మక సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.





















