Kishkindhapuri Collection: బలంగా నిలబడిన బెల్లంకొండ... ఏకంగా 20 శాతం పెరిగిన 'కిష్కింధపురి' కలెక్షన్స్ - రెండు రోజుల్లో ఎంతంటే?
Kishkindhapuri Box Office Collection Day 2: 'మిరాయ్' పోటీని తట్టుకుని మరీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'కిష్కింధపురి' నిలబడింది. రెండో రోజు సినిమా కలెక్షన్స్ పెరిగాయ్. టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Kishkindhapuri Two Days Collection: 'మిరాయ్'తో పాటు ఒకే రోజు రిలీజ్ అవ్వడం వల్ల 'కిష్కింధపురి' నష్టం జరిగింది. ఆ మీద కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడింది. అయినా సరే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బలంగా నిలబడ్డాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర తన మూవీని బలంగా నిలబెట్టాడు. ఓపెనింగ్ డే కంటే రెండో రోజు ఏకంగా 20 శాతం గ్రోత్ ఈ మూవీ కలెక్షన్లలో కనిపించింది. రెండో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే...
రెండో రోజు 'కిష్కింధపురి'కి 23 శాతం గ్రోత్!
Kishkindhapuri Second Day Collection: 'కిష్కింధపురి' సినిమాకు ఓపెనింగ్ డే ఇండియాలో రెండు కోట్ల నెట్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు శనివారం ఉదయం రిపోర్ట్ చేశాయి. ఫైనల్ కలెక్షన్స్ చూస్తే... రెండు కోట్ల 15 లక్షల రూపాయలు వచ్చింది. దాంతో కంపేర్ చేస్తే రెండో రోజు అయినటువంటి శనివారం ఏకంగా 23 శాతం గ్రోత్ కలెక్షన్లలో కనిపించింది.
'కిష్కింధపురి' చిత్రానికి రెండో రోజు ఇండియాలో 2.66 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఒక వైపు మెజారిటీ థియేటర్లలో 'మిరాయ్' ఆడుతోంది. దానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. మరోవైపు 'కిష్కింధపురి'కి మిక్స్డ్ టాక్ లభించింది. యునానిమస్ పాజిటివ్ టాక్ లేదని చెప్పాలి. అయినా సరే బాక్స్ ఆఫీస్ బరిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బలంగా నిలబడి రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాడు. రెండు రోజుల్లో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ రూ. 4.30 కోట్లు దాటింది. ఫుల్ రిపోర్ట్ వచ్చేసరికి అది ఐదు కోట్ల నెట్ కలెక్షన్ కావచ్చు.
ఓవర్సీస్‌లోనూ నెమ్మదిగా పెరుగుతున్న కలెక్షన్స్!
Kishkindhapuri Overseas Collection: ఓవర్సీస్ మార్కెట్లో కూడా 'కిష్కింధపురి'కి ఆదరణ పెరుగుతోంది. ఫస్ట్ డే నార్త్ అమెరికాలో కేవలం 43 వేల డాలర్లు మాత్రమే వచ్చాయి. ఆ నెంబర్ రెండో రోజు పెరిగింది. 'కిష్కింధపురి' సెకండ్ డే అమెరికాలో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించింది. రెండో రోజు 70 వేల నుంచి 80 వేల డాలర్ల మధ్యలో కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల నుంచి రిపోర్ట్ అందుతుంది. ఇప్పటి వరకు అక్కడ 1,30,000 డాలర్లు పైగా కలెక్ట్ చేసింది. ఆ నెంబర్ నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంది.
'కిష్కింధపురి' విడుదలైన తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెట్టిన ఎఫర్ట్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయని చెప్పవచ్చు. తాము 20 కోట్ల బడ్జెట్లో చిన్న సినిమా చేశామని, తమ సినిమాను సైతం ఆదరించమని ఆయన రిక్వెస్ట్ చేశారు. హారర్ థ్రిల్లర్ జానర్ మూవీ కావడంతో అటువంటి సినిమాల కోసం ఎదురు చూసే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. దాంతో రెండు రోజు కలెక్షన్స్ పెరిగాయి. ఆదివారం కూడా వసూళ్లు బాగుండే అవకాశం ఉంది. వీకెండ్ తర్వాత సిచువేషన్ ఎలా ఉంటుందో చూడాలి. 'చావు కబురు చల్లగా' ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'కిష్కింధపురి' చిత్రాన్ని సైన్ స్క్రీన్ పతాకం మీద సాహు గారపాటి ప్రొడ్యూస్ చేశారు.





















