Avantika Vandanapu: మొన్న అలా, ఈ రోజు ఇలా - రెస్టారెంట్‌లో పనిచేస్తూ కనిపించిన అవంతిక వందనపు, వీడియో వైరల్
Avantika Vandanapu: ఇటీవల హాలీవుడ్ సెన్సేషన్‌గా మారిన తెలుగమ్మాయి అవంతిక వందనపు. ‘మీన్ గర్ల్స్’తో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న అవంతిక.. తాజాగా రెస్టారెంటులో పనిచేస్తూ కనిపించింది.
Avantika Vandanapu: చాలామంది నటీమణులు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ రేంజ్ వరకు ఎదగడానికి ప్రయత్నిస్తారు. దానికోసం కష్టపడతారు. కానీ ఒక టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రం ఏకంగా టాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగిపోయింది. అది చూసి ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తనే ‘అవంతిక వందనపు’. తెలుగులో దాదాపు పదికి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది అవంతిక. అంతే కాకుండా కొన్ని యాడ్స్‌లో కూడా కనిపించింది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌లో అడుగుపెట్టి ఫేమస్ అయిపోయింది. అలాంటి తను ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘మీన్ గర్ల్స్‌తో పాపులారిటీ..
ముందుగా మహేశ్ బాబు హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది అవంతిక వందనపు. ఆ తర్వాత ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’, ‘ప్రేమమ్’, ‘అజ్ఞాతవాసి’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి చిత్రాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెరిసింది. సినిమాలతో పాటు బుల్లితెరపై పలు యాడ్స్‌లో కూడా కనిపించింది అవంతిక. కానీ ఆ తర్వాత స్క్రీన్‌పై తన జాడ లేదు. ఉన్నట్టుండి ఇన్నేళ్ల తర్వాత హాలీవుడ్‌లో అవంతిక పేరు మారుమోగిపోవడం చూసి తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. తన మాట, లుక్స్, ప్రవర్తన అన్నీ మారిపోయాయి. ‘మీన్ గర్ల్స్’ అనే ఇంగ్లీష్ సినిమాలో కరేన్ శెట్టిగా నటించి మెప్పించింది అవంతిక.
రెస్టారెంట్‌లో ఉద్యోగం..
‘మీన్ గర్ల్స్’ అనేది పాపులర్ హాలీవుడ్ సినిమా ఫ్రాంచైజ్. ఈ ఫ్రాంచైజ్ నుంచి తాజాగా మరో చిత్రం విడుదలయ్యింది. ఇందులో అవంతిక వందనపు కూడా ఒక లీడ్ రోల్‌లో నటించడం చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంత త్వరగా ఎదిగిపోయింది అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకప్పుడు తను చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సినిమాలతో.. ఇప్పుడు తనను పోల్చి చూస్తూ ఆశ్చర్యపోయారు. ఇక టాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో కూడా ఒక్కసారిగా పాపులర్ అయిపోయిన అవంతిక.. తాజాగా ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తూ కనిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
తనతో పనిచేయడం ఆనందంగా ఉంది..
‘మీన్ గర్ల్స్’లో నటించే అవకాశం రాకముందు అవంతిక.. ‘రైసింగ్ కేన్స్’ అనే చిన్న రెస్టారెంట్‌లో పనిచేసింది. ఇప్పుడు తను నటించిన సినిమా సూపర్ హిట్ అయ్యి.. తను పెద్ద స్టార్ అయిపోయింది. అయినా కూడా తాజాగా ఆ రెస్టారెంట్‌కు వెళ్లి పనిచేసింది. ఈ విషయాన్ని రైసింగ్ కేన్స్.. తమ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది. ‘అవంతిక రైసింగ్ కేన్స్ కౌంటర్‌కు గ్లామర్‌తో పాటు పింక్ టచ్‌ను తీసుకొచ్చింది. తనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ క్యాప్షన్ కూడా షేర్ చేసింది. ప్రస్తుతం తను హాలీవుడ్‌లో రైసింగ్ స్టార్ అవ్వడంతో ఈ రెస్టారెంట్ ఉద్యోగం నుంచి తప్పుకోనుందని సమాచారం. ఇక రైసింగ్ కేన్స్ షేర్ చేసిన ఈ వీడియోలో అవంతిక చాలా క్యూట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: హాలీవుడ్ హీరోలతో షారుఖ్ ఖాన్ పోటీ - ఇంటర్నేషన్ స్టంట్ అవార్డ్స్ రేసులో ‘పఠాన్’, ‘జవాన్’