Mass Jathara Teaser: 'మాస్ జాతర' టీజర్ రిలీజ్ డేట్ & టైమ్ ఫిక్స్... ఎప్పుడంటే?
Mass Jathara Teaser Release Date: వినాయక చవితికి థియేటర్లలోకి రానున్న మాస్ మహారాజా తాజా సినిమా 'మాస్ జాతర'. శ్రీలీల హీరోయిన్. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్ చేశారు.

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న75వ సినిమా 'మాస్ జాతర' (Mass Jathara Movie). ఇందులో శ్రీ లీల (Sreeleela) హీరోయిన్. బ్లాక్ బస్టర్ 'ధమాకా' తర్వాత వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రమిది. నెలాఖరున థియేటర్లలోకి సినిమా రానుంది. త్వరలో టీజర్ విడుదల కానుంది.
ఆగస్టు 11న 'మాస్ జాతర' టీజర్ రిలీజ్!
Mass Jathara Teaser Release Date Time: ఆగస్టు 11న... అంటే ఈ సోమవారం ఉదయం 11.08 గంటలకు 'మాస్ జాతర' టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
'మాస్ జాతర'కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 'ధమాకా'కు సైతం ఆయనే సంగీత దర్శకుడు. ఆల్రెడీ సినిమా నుంచి విడుదలైన 'తూ మేరా లవర్', 'ఓలే ఓలే' చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
Also Read: మహేష్ బాబు పర్సనల్ లైఫ్ గురించి గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రశ్నలు... సమాధానాలు తెల్సా?
View this post on Instagram
వినాయక చవితికి సినిమా విడుదల!
Mass Jathara Release Date: వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న 'మాస్ జతర' సినిమా విడుదల కానుంది. రవితేజ నుంచి ఆయన అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఫిల్మ్ ఇదని, వింటేజ్ వైబ్స్ - కమర్షియల్ హంగులతో థియేటర్లలో మాస్ పండుగ తీసుకొస్తామని చిత్ర బృందం అంటోంది.
'మాస్ జాతర'తో రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: విధు అయ్యన్న, మాటలు: నందు సవిరిగాన, కళా దర్శకుడు: శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ.
Also Read: రియల్ హీరో... లిటిల్ హార్ట్స్ సేవియర్ మహేష్ బాబు - సూపర్ స్టార్ ఫౌండేషన్ నుంచి సాయం ఇలా పొందొచ్చు!





















