(Source: ECI/ABP News/ABP Majha)
Manjummel Boys: పెట్టింది రూ.4 కోట్లు, వచ్చింది రూ.200 కోట్లు - ఆ మలయాళీ మూవీ క్రేజ్ మామూలుగా లేదుగా!
Manjummel Boys Collections: కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’. కానీ సినిమాకు దేశవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ మాత్రం రూ.200 కోట్లు.
Manjummel Boys Box Office Collections: ఒకప్పుడు రీజియనల్ భాషా చిత్రాలు అంటే రూ.50 కోట్ల కలెక్షన్స్ సాధించడమే గొప్ప అనుకునేవాళ్లు. హాలీవుడ్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉండేవారు కాబట్టి ఆ సినిమాలకు వందల కోట్ల కలెక్షన్స్ వచ్చేవి. అలాగే హిందీ సినిమాలను ఇష్టపడి చూసే మూవీ లవర్స్ దేశవ్యాప్తంగా ఉండేవారు కాబట్టి వాటికి కూడా కలెక్షన్స్ దాదాపుగా అదే రేంజ్‌లో వచ్చేవి. కానీ రీజియనల్ భాషా చిత్రాలకు అలా కాదు.. కొన్నేళ్ల క్రితం ‘బాహుబలి’తో టాలీవుడ్ రాతను మార్చారు రాజమౌళి. ఇప్పుడు మలయాళ మూవీ మేకర్స్ కూడా కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తుండగా.. తాజాగా విడుదలయిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ చరిత్రను తిరగరాసింది.
తక్కువ బడ్జెట్.. ఎక్కువ కలెక్షన్స్..
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా కంటెంట్ ఉన్న తక్కువ బడ్జెట్ చిత్రాలు చాలానే వస్తుంటాయి. కానీ ఒకప్పుడు వీటి మార్కెట్ ఆ రేంజ్‌లో ఉండేది కాదు. అందుకే కలెక్షన్స్ కూడా ఒక రేంజ్‌లో వచ్చేవి కాదు. మొదటిసారి ‘బాహుబలి’ అనే సినిమాతో రిస్క్ చేసి మార్కెట్‌కు మించి పెట్టుబడి పెట్టి.. టాలీవుడ్ స్థాయిని మార్చారు రాజమౌళి. ఇక కన్నడ సినీ పరిశ్రమ నుంచి అదే రిస్క్‌ను తీసుకోవడానికి ప్రశాంత్ నీల్ ముందుకొచ్చారు. ‘కేజీఎఫ్’తో శాండిల్‌వుడ్ రేంజ్‌ను మార్చారు. ఇప్పుడు ఇక మాలీవుడ్ మేకర్స్ వంతు వచ్చేసింది. మలయాళంలో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కడం చాలా అరుదుగా ఉంటుంది. అతి తక్కువ బడ్జెట్‌తో అత్యధిక వసూళ్లు ఎలా సాధించాలో ఇతర ఇండస్ట్రీలకు పాఠాలు చెప్తోంది మాలీవుడ్.
మంచి రోజులు వచ్చాయి..
చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ బడ్జెట్ కేవలం రూ.4 కోట్లు మాత్రమే. కానీ దేశవ్యాప్తంగా ఈ మూవీ కలెక్షన్స్ రూ.200 కోట్లకు చేరువలో ఉన్నాయి. ఇప్పటివరకు ఏ మలయాళ చిత్రానికి ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రాలేదు. ఇప్పటివరకు మలయాళంలో తెరకెక్కిన ‘2018’ మాత్రమే రూ.170 కోట్ల కలెక్షన్స్‌తో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు దానిని కూడా దాటేసి.. ‘మంజుమ్మెల్ బాయ్స్’ రూ.200 కోట్ల కలెక్షన్స్ వైపు దూసుకెళ్తోంది. దీంతో మలయాళ సినిమాకు మంచి రోజులు వచ్చాయని ఇండస్ట్రీ నిపుణులు మాట్లాడుకుంటున్నారు. ‘మంజుమ్మెల్ బాయ్స్’ మాత్రమే కాదు.. ఒక నెలలో విడుదలయిన మూడు మలయాళ చిత్రాలు దేశవ్యాప్తంగా మూవీ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి.
ఒకేసారి మూడు సినిమాలు..
ముందుగా క్యూట్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మలయాళ చిత్రం ‘ప్రేమలు’. ఈ సినిమాలో చెప్పుకునేంత కథ లేదు మనం ఎప్పుడూ చూస్తుండే ప్రేమకథలాగానే ఉంటుంది. కానీ కథనాన్ని ఫ్రెష్‌గా నడిపించి, నటీనటుల నటనతో మెప్పించగలిగారు మేకర్స్. ‘ప్రేమలు’ విడుదలయిన కొన్నిరోజులకే ‘మంజుమ్మెల్ బాయ్స్’ కూడా థియేటర్లలో విడుదలయ్యింది. మూవీకి పాజిటివ్ టాక్ మొదలవ్వడంతో ఇతర రాష్ట్రాల్లో థియేటర్లు పెరిగాయి. ఇప్పటికీ ఈ సినిమా కేరళలో మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాల్లోని థియేటర్లలో కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక మమ్ముట్టి ‘భ్రమయుగం’ కూడా థియేటర్లలో ఆడియన్స్‌తో పాటు ఓటీటీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంది.
Also Read: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ జాతర - జస్ట్ 15 రోజుల్లో 100 సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజుకు రెడీ