Manchu Mounika Reddy: నీ ప్రేమతో నా లైఫ్‌ని మరింత బెటర్‌గా చేస్తున్నావు, నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్యూ - మౌనిక రెడ్డి ఎమోషనల్
Manchu Mounika Reddy Post: మంచు మనోజ్ భార్య మౌనిక రెడ్డి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. కొడుకు ధైరవ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ భామ కొడుకు ధైరవ్‌ని ఉద్దేశిస్తూ భావోద్వేగానికి లోనైంది.
![Manchu Mounika Reddy: నీ ప్రేమతో నా లైఫ్‌ని మరింత బెటర్‌గా చేస్తున్నావు, నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్యూ - మౌనిక రెడ్డి ఎమోషనల్ Manchu Mounika Reddy Birthday Wishes to Son Dhairav on Instagram Manchu Mounika Reddy: నీ ప్రేమతో నా లైఫ్‌ని మరింత బెటర్‌గా చేస్తున్నావు, నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్యూ - మౌనిక రెడ్డి ఎమోషనల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/01/df9a4ede31996c39e7b98f129a6972bd1722519116230929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Manchu Manoj Wife Mounika Emotional Post: హీరో మంచు మనోజ్ (Manchu Manoj) భార్య మౌనిక రెడ్డి ఎమోషనల్ అయ్యింది. ఇవాళ తన మొదటి కుమారుడు ధైరవ్ పుట్టిన రోజు. ఆగష్టు 1న ధైరవ్ బర్త్‌డే సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తనయుడికి విషెస్ తెలిపిందే. ఈ సందర్భంగా ధైరవ్‌తో దిగిన పలు ఫోటోలు షేర్ చేసింది. 'హ్యాపీయెస్ట్ బర్త్‌డే మై సన్-షైన్(SON-SHINE). నీ ప్రేమ, స్మైల్, ఎనర్జీ అన్నీ కూడా నన్ను రోజురోజరుకు మరింత బేటర్‌గా మారుస్తున్నాయి. నన్ను నీ తల్లిగా ఎంచుకున్నందుకు ధన్యురాలిని. అలాగే నా జీవితాన్ని మీ ప్రేమ, ఉనికితో రక్షిస్తున్నందుకు ధన్యవాదాలు.
నా జీవితాన్ని అందంగా మలిచావు..
నువ్వు ఇంకా మరెన్నో అందమైన పుట్టినరోజులు జరుపుకోవాలి. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. అలాగే నాకు ఇది మదర్స్ డేట్. నువ్వు నా చీర్ లీడర్. నువ్వు నన్ను చూస్తూ ఉన్నప్పుడల్లా కలిగిన అనుభూతిని నేను మాటల్లో చెప్పలేను. అప్పడు నువ్వు ఎంత ముద్దొస్తావో. నీవల్ల కొన్నిసార్లు నేను కూడా పసిపాపను అయిపోతాను. ఈ భూమి మీద నా జీవితాన్ని ఇంత అందంగా మలిచిన నీకు ఈ జీవితాన్ని ఇంత అందంగా మార్చినందుకు థ్యాంక్యూ. నీకు ఎప్పుడు శోభ అమ్మమ్మ- భుమా తాతయ్య, నిర్మలా నానమ్మ-బాబు తాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ నాన్న(మనోజ్) నేను ఎప్పుడూ నీ వెన్నంటే నిలబడతాం.. నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలి బేబి. లవ్ యూ" అంటూ తన పోస్ట్‌కు రాసుకొచ్చింది.
View this post on Instagram
హ్యాపీ బర్త్ డే మై అమెజింగ్ సన్
అలాగే మనోజ్ కూడా ధైరవ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపాడు. ధైరవ్‌తో ఉన్న చిన్ననాటి ఫోటోలు ఇప్పటి వరకు దిగిన స్పెషల్ మూమెంట్ ఫోటోలు షేర్ చేశారు. హ్యాపీ 6th బర్త్‌డే ధైరవ్ అంటూ విష్ చేశాడు. కాగా మంచు మనోజ్-మౌనిక రెడ్డిలు గతేడాది మార్చిలో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొంతకాలం రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు పెద్ద సమక్షంలో ఒక్కటయ్యారు. వీరిద్దరి ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. ధైరవ్ మౌనికి మొదటి భర్త సంతానం. ఇటీవల ఈ మనోజ్-మౌనికలు కూతురు జన్మించింది. పాపకు దేవసేన శోభా అని నామకరం చేసినట్టు ఇటీవల ప్రకటించారు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)