Manchu Lakshmi: మా లాంటి వారికి ఆఫర్ ఇవ్వాలంటే ఆలోచిస్తారు - నా కెరీర్‌కు నా కుటుంబమే అడ్డుపడుతుంది..
Manchu Lakshmi Comments: తాజాగా ఇంటర్య్వూలో మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ చేసింది. తన కెరీర్‌కు తన తండ్రి, సోదరులే అడ్డుపడుతున్నారంటూ ఊహించని కామెంట్స్ చేసింది.
![Manchu Lakshmi: మా లాంటి వారికి ఆఫర్ ఇవ్వాలంటే ఆలోచిస్తారు - నా కెరీర్‌కు నా కుటుంబమే అడ్డుపడుతుంది.. Manchu Lakshmi calls herself victim of patriarchy said family road blocked her career Manchu Lakshmi: మా లాంటి వారికి ఆఫర్ ఇవ్వాలంటే ఆలోచిస్తారు - నా కెరీర్‌కు నా కుటుంబమే అడ్డుపడుతుంది..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/20/f8ad624a6b5c6a738c6690a3032827e61718892994544929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Manchu Lakshmi called herself victim of patriarchy: ఈ మధ్య తెలుగులో మంచు లక్ష్మి సందడి తగ్గిపోయింది. మొన్నటి వరకు వరుసగా సినిమాలు చేసిన ఆమె అసలు తెలుగు సినిమాలే చేయడం లేదు. రీసెంట్‌గా ఓ తమిళ సినిమా నటించింది. గతేడాది సడెన్ మంచు లక్ష్మి ముంబైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో నటిస్తూ.. ముంబైకి షిఫ్ట్ అవ్వడమేంటని అంతా అనుకున్నారు. పోనీ ఏదైనా ఆఫర్ వచ్చి వెళ్లిందా అంటే అదీ కాదు. దీంతో మంచు లక్ష్మి ఎందుకు ముంబై వెళ్లిందా అంతా ఆలోచనలో పడ్డారు.
అక్కడికి వెళ్లినప్పటి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. అంతేకాదు తన లుక్కు, కట్టుబోట్టు కూడా మార్చేసింది. అక్కడ చిన్న చిన్న షోలు చేస్తూ.. ఇంటర్య్వూ ఇస్తూ ఆఫర్స్ కోసం ట్రై చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన మంచు లక్ష్మి తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది. తన కెరీర్‌కు తన కుటుంబమే అడ్డుపడుతుందంటూ ఊహించని కామెంట్స్ చేసింది. అంతేకాదు స్టార్ కిడ్ అయినా సౌత్‌లో ఆఫర్స్ రావడం అంత ఈజీ కాదు షాకింగ్ విషయాలు బయటపెట్టింది.
సౌత్ ఇండస్ట్రీలో అలా..
ఈ మేరకు మంచు లక్ష్మి మాట్లాడుతూ.. దక్షిణాది పరిశ్రమలో హీరోల కూతుళ్లకు, హీరోల సోదరిమణులకు పెద్దగా ఆఫర్స్ రావు. మా లాంటి వాళ్లను సినిమాలోకి తీసుకోవాలంటే ఆలోచిస్తారు. ఇది ఒక్క సౌత్‌లోనే కాదు. దేశమంతటా ఉంది. పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా ఓ బాధితురాలినే. నా తమ్ముళ్లు(మంచు విష్ణు, మనోజ్) ఈజీగా సాధించేవాటిని కూడా నేను కష్టంగా పొందాల్సి వచ్చేది. నేను నటిని అవ్వడం మా నాన్నకు(మంచు మోహన్ బాబు) అసలు ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే నా కెరీర్‌కి, జీవితానికి నా కుటుంబమే అడ్డుపడుతుందని చెప్పాలి.
ముంబైకి వెళ్తానంటే భయపడ్డారు..
మాది పెద్ద కుటుంబం. మేమంతా కలిసే ఉంటాం. ఇక ఇంట్లో ఆడిపిల్లను నేను ఒక్కదాన్నే. అందుకే నాపై శ్రద్ద ఎక్కువ. ముఖ్యంగా మా నాన్నకి. దీంతో నేను ఎక్కడికి వెళ్తాను అన్నా అసలు ఒప్పుకునేవారు కాదు. మొదట నేను ముంబైకి వెళ్తానని చెప్పిన వారు అసలు ఒప్పుకోలేదు. అదోక పెద్ద చెరువు అని, అందులో నువ్వోక చేప పిల్లవు ఈదలేవు అంటూ నన్ను భయపెట్టారు. అలాగే వారు కూడా లేనిపోని అపోహాలతో భయపడ్డారు. అలా నేను ఏం చేస్తానన్నా కూడా ఏవేవో భయాలతో వద్దని చెప్పేవారు. దీంతో నేను కూడా సరైనా నిర్ణయం తీసుకునేదాన్ని కాదు. ఎప్పుడైనా నా జీవితం ఏంటని ఆలోచిస్తే నాకేం అర్థం అయ్యేది కాదు" అంటూ చెప్పుకొచ్చింది.
"ఇండస్ట్రీలో నాకు రకుల్ ప్రీత్ సింగ్ బెస్ట్ ఫ్రెండ్. తనవల్లే నేను ముంబైకి వచ్చాను. ఇక్కడికి వచ్చిన కొత్తలో తన ఇంట్లోనే ఉండేదాన్ని. తనెప్పుడూ ముంబైకి వచ్చేయొచ్చు కదా అనేది. రానా కూడా ఎంతకాలమని హైదరాబాద్‌లోనే ఉంటాయి. చేంజ్ అవుతూ ఉండాలి. కెరీర్ బాగుండాలంటే ముంబై వెళ్లమని సలహా ఇచ్చేవాడు. నాకు కూడా ఎదైనా కొత్తగా ట్రై చేయాలి అనిపించేది. అలా ముంబైకి షిఫ్ట్ అయ్యాను" అని పేర్కొంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)