![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Raj Tarun Case: రాజ్ తరుణ్ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు
Malvi Malhotra: రాజ్ తరుణ్ ప్రియురాలిపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఉమెన్ సేఫ్ట్ వింగ్ డిసిపికి ఫిర్యాదు చేశారు. తన ఆరోపణలలో నిజం లేదని, లావణ్య ఎవరో కూడా తనకు తెలియదని షాకింగ్ కామెంట్స్ చేశారు.
![Raj Tarun Case: రాజ్ తరుణ్ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు Malvi Malhotra Clarifies Relation With Raj Tarun and Complaint on Lavanya Raj Tarun Case: రాజ్ తరుణ్ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/b71e998ab782d057c16472e897a71e7d1720277481297929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Malvi Malhotra Complaint on Raj Tarun Girlfriend Lavanya: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, అతడి గర్ల్‌ఫ్రెండ్ లావణ్య కేసు మరో ట్విస్ట్ నెలకొంది. లావణ్యపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనపై పరువు నష్టం దావా కూడా వేసింది. కాగా నిన్నటి నుంచి రాజ్ తరుణ్-లావణ్య కేసు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ వ్యవహరంలో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పేరు కూడా బాగా వినిపిస్తుంది. రాజ్ తరుణ్ మాల్వీతో ప్రేమయాణం నడిపిస్తున్నాడని, అందుకే తనని దూరం పెడుతున్నాడంటూ అతడి ప్రియురాలు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే.
అంతేకాదు వీరిద్దరు కలిసి గోవా, చెన్నై, పాండిచ్చేరి ఇలా వెకేషన్స్‌కి వెళ్లారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక రాజ్ తరుణ్ కూడా స్పందిస్తూ లావణ్యతో రిలేషన్‌లో ఉన్నట్టు ఒప్పుకున్నాడు. కానీ, అది ఒకప్పుడని, ఇప్పుడు తనకి ఆమె సంబంధం లేదన్నాడు. లావణ్య తనతో ఉంటూనే మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు తనకు ఉన్న డ్రగ్స్ అలవాటు వల్లే ఆమెను నుంచి దూరంగా ఉన్నానని చెప్పాడు. ఇక కేసులో తన ఆరోపణలకు ఖచ్చితమైన ఆధారాలు చూపించాలని నార్సింగ్ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చి షాకిచ్చారు. ఇక ఇప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కూడా లావణ్యపై ఫిర్యాదు చేయడంతో కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.
లావణ్య ఎవరో కూడా తెలియదు
అంతేకాదు తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు గాను ఉమెన్ సేఫ్ట్ వింగ్ డిసిపికి కూడా ఫిర్యాదు చేసినట్టు మాల్వీ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్ తరుణ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. అతడు కేవలం నా సహానటుడు మాత్రమే. నిజానికి నాకు లావణ్య ఎవరో కూడా తెలియదు. ఆమెను నేరుగా నేనేప్పుడు చూడలేదు. ఆమెతో నాకు అసలు పరిచయం లేదు. నా సోదరుడు, నేను ఆమెకు ఫోన్ చేసి బెదరిస్తున్నట్టు చెప్పింది. అవన్ని తప్పుడు ఆరోపణలు. ఆమె రాజ్ తరుణ్‌తో నటించిన ప్రతి హీరోయిన్‌ని అనుమానిస్తుందట. ఎలాంటి సంబంధం లేని నా పేరు చెప్పి నా రిప్యూటేషన్ దెబ్బతిస్తుంది" అంటూ మాల్వీ వాపోయింది.
అలాగే "రాజ్ తరుణ్‌తో కేవలం నాకు సినిమా పరిచయమే ఉంది. మా సినిమా చివరి షెడ్యూల్ గతేడాది ఆగస్ట్, సెప్టెంబర్‌లో జరిగింది. అప్పుడు ఆమె నాకు ఫోన్ చేసి రాజ్‌తో మాట్లాడకు అని బెదిరించింది. దీంతో నేను రాజ్‌తో చెప్పాను. తను నెంబర్ బ్లాక్ చేయమని చెప్పాడు. కానీ, ఆమె నా పేరెంట్స్‌కి ఫోన్ చేసి నేను రాజ్ తరుణ్‌తో ఉంటున్నట్టు చెప్పింది. ఆమె ఎందుకిలా చేస్తుంది. నా తల్లిదండ్రులు హిమాచల్ ప్రదేశ్ ఉంటారు. ఆమెకు నా పేరెంట్స్ నెంబర్ వచ్చిందో నాకు తెలియాలి. తన వల్ల నాకు, నా పేరెంట్స్‌కి మెంటల్ హెరాస్మెంట్ ఎక్కువ అయ్యింది. తనకు అసలు నా తల్లిదండ్రులు ఫోన్ నెంబర్ ఎలా తెలిసిందనేది నాకు కావాలి. అలాగే ఈ కేసు విషయంలో నా పేరు ఎందుకు చెప్పిందనేది అర్థం కావడం లేదు. ఈ విషయంలో నేను లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాను. ఆమెపై ఉమెన్ సేఫ్ట్ వింగ్ డిసిపి ఫిర్యాదు చేశాను. లావణ్య పై చర్యలు తీసుకోవాలని కోరాను" అని ఆమె తెలిపింది.
Also Read: హీరో రాజ్ తరుణ్‌పై చీటింగ్ కేసు - హీరోయిన్‌తో ఎఫైర్, నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు ఫిర్యాదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)