అన్వేషించండి

Mamitha Baiju: ‘ప్రేమలు’ భామకు భలే డిమాండ్ - త్వరలోనే తెలుగులోకి ఎంట్రీ

Mamitha Baiju: మలయాళ భామలకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజే వేరు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ‘ప్రేమలు’ బ్యూటీ కూడా యాడ్ అవ్వనుంది. త్వరలోనే తెలుగులో అడుగుపెట్టడానికి మమితా సిద్ధమవుతోంది.

Premalu Heroine Mamitha Baiju: ఒక భాషలో సినిమా హిట్ అయితే రీమేక్ చేయడానికి ఇతర భాషల నిర్మాతలు క్యూ కడతారు. అదే విధంగా ఒక భాషలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ను కూడా తమ ఇండస్ట్రీకి తీసుకురావాలని ప్రొడ్యూసర్స్ ఆశపడతారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో మలయాళ బ్యూటీలకు చాలా డిమాండ్ ఉంది. వారంటే ప్రేక్షకులకు కూడా ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంది. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్ లాంటి నటీమణులు తెలుగులోనే ఎక్కువగా ఫేమ్ సంపాదించుకొని టాలీవుడ్‌లో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మరో మలయాళ ముద్దుగుమ్మ కూడా త్వరలోనే తెలుగులో ఎంట్రీకి సిద్ధమవుతుందని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

సూపర్ హిట్ ‘ప్రేమలు’..

తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మలయాళ మూవీ ‘ప్రేమలు’. ఈ సినిమా షూటింగ్ అంతా దాదాపుగా హైదరాబాద్‌లోనే జరగడంతో తెలుగు ప్రేక్షకులు.. ఈ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. అంతే కాకుండా నేరుగా మలయాళంలోనే విడుదలయినా కూడా చాలామంది తెలుగు ప్రేక్షకులు.. ఈ సినిమాను చూడడానికి నేరుగా థియేటర్లకు వెళ్లడం విశేషాలు. ఇప్పటికే ‘ప్రేమలు’ను డబ్ చేయాలా లేదా రీమేక్ చేయాలా అనే ఆలోచనతో టాలీవుడ్ నిర్మాతలు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతలోనే ఇందులో హీరోయిన్‌గా నటించిన మమితా బైజుకు టాలీవుడ్‌లో డిమాండ్ మొదలయ్యింది.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ..

కేరళలోని కొట్టాయంలో పుట్టి పెరిగింది మమితా. 2017లో ‘సర్వోపరి పాలక్కారన్’ అనే చిత్రంతో నటిగా మొదటిసారి వెండితెరపై వెలిగింది. అప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగానే సినిమాలు చేస్తూ వెళ్లిన మమితాకు 2021లో విడుదలయిన ‘ఆపరేషన్ జావా’ మంచి బ్రేక్ ఇచ్చింది. ఇందులో కూడా తను మెయిన్ హీరోయిన్‌గా నటించలేదు. కానీ స్క్రీన్‌పై ఉన్నంతసేపు తన నటనతో ఆకట్టుకుంది. దీంతో తనకు సెకండ్ హీరోయిన్ ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టారు మేకర్స్. ఇక మొదటిసారి తను సోలో హీరోయిన్‌గా నటించిన చిత్రమే ‘ప్రేమలు’. దీంతో తనకు మలయాళంలోనే కాదు.. తెలుగులో కూడా క్రేజ్ పెరిగిపోయింది. ఎలాగైనా తనను టాలీవుడ్‌కు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు మొదలుపెట్టారు.

తమిళంలో డెబ్యూ..

కెరీర్ ప్రారంభమయినప్పటి నుండి కేవలం మలయాళ సినిమాల్లోనే నటించింది మమితా. కానీ త్వరలోనే తను నటించిన మొదటి తమిళ చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. జీవీ ప్రకాశ్ సరసన ‘రెబెల్’ అనే చిత్రంలో నటించి మొదటిసారి తమిళ ప్రేక్షకులను పలకరించనుంది ఈ మలయాళ భామ. తాజాగా గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమలు’లో రీను రాయ్‌గా తన నటనతో యూత్‌ను ఫిదా చేసింది. అందుకే తనకు అలాంటి తరహా పాత్రలే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కరెక్ట్‌గా సెట్ అయితే తనకు మరిన్ని తమిళ సినిమా అవకాశాలతో పాటు తెలుగులో కూడా తను డెబ్యూ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎందరో మలయాళ హీరోయిన్లను ఆదరించిన తెలుగు ప్రేక్షకులు మమితాను కూడా ఆదరిస్తారని ‘ప్రేమలు’ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

Also Read: పోలీసులను ఆశ్రయించిన నటి విద్యాబాలన్ - వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

టాప్ హెడ్ లైన్స్

Love Drama OTT : సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
Vishwanath And Sons : సూర్య కాళ్లపై పడ్డ డైరెక్టర్ వెంకీ - స్టార్ హీరో రియాక్షన్ చూశారా?... వీడియో వైరల్
సూర్య కాళ్లపై పడ్డ డైరెక్టర్ వెంకీ - స్టార్ హీరో రియాక్షన్ చూశారా?... వీడియో వైరల్
Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget