అన్వేషించండి

Vidya Balan : పోలీసులను ఆశ్రయించిన నటి విద్యాబాలన్ - వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Vidya Balan : సైబ‌ర్ నేర‌గాళ్లు ఈ రోజుల్లో రెచ్చిపోతున్నారు. సెల‌బ్రిటీల‌నే టార్గెట్ చేస్తూ డ‌బ్బులు దండుకుంటున్నారు. విద్యాబాల‌న్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు.

Vidya Balan Files Complaint: టెక్నాల‌జీ పెరిగిన త‌ర్వాత‌.. దాంతో ఎంత ఉప‌యోగాలు ఉన్నాయో, అనర్థాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. కొంత‌మంది ఈజీ మ‌నీకి అల‌వాటు ప‌డి దందాలు చేస్తున్నారు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి డ‌బ్బులు దండుకుంటున్నారు. మొన్న‌టికి మొన్న స‌ల్మాన్ ఖాన్  ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు కొంత‌మంది. ఇప్పుడు విద్యాబాల‌న్ పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. జాబ్స్ ఇప్పిస్తామంటూ డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు. దీంతో ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 

ఎఫ్ ఐఆర్ న‌మోదు.. 

బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు ఖార్ పోలీసులు చెప్పారు. సెక్ష‌న్ 66 (C) ఐటీ యాక్ట్ కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు చెప్పారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఒక‌రు విద్యాబాల‌న్ పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఆమె ఫొటోల‌ను, రీల్స్ ని అందులో ఉంచి అచ్చం ఆమె నిజం అకౌంట్ లానే దాన్ని క్రియేట్ చేసి, జాబ్స్ ఇప్పిస్తానంటూ డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు. ఆ విష‌యం విద్యాబాల‌న్ దృష్టికి రావ‌డంతో ఆమె కేసు న‌మోదు చేశారు. దీంతో ఎఫ్ ఐఆర్ న‌మోదు చేశారు పోలీసులు. ఆ వ్య‌క్తి ఎవ‌రో తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్లు చెప్పారు పోలీసులు. 

9.2 మిలియ‌న్ ఫాలోయ‌ర్స్.. 

విద్యాబాల‌న్.. బాలీవుడ్ లో ఈమెకు ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు విద్యా. ఆమెకు దాదాపు 9.2 మిలియ‌న్ ఫాలోయ‌ర్స్ ఉన్నారు ఇన్ స్టాలో. ఫొటోలు, రీల్స్ షేర్ చేస్తూ అభిమానుల‌కు ఆమెకు సంబంధించి అప్ డేట్స్ ఇస్తుంటారు. దీన్ని ఆస‌రాగా తీసుకున్న సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. అందుకే, సెల‌బ్రిటీల అకౌంట్స్ ని ఫాలో అయ్యేట‌ప్పుడు, పోస్ట్ లు నమ్మేముందు ఒక‌టికి రెండు సార్లు చెక్ చేసుకోవాల‌ని సూచిస్తున్నారు పోలీసులు. ఇలాంటి ఫేక్ పోస్ట్ ల‌కు రెస్పాండ్ అయ్యి ఇబ్బందుల్లో ప‌డి, డ‌బ్బులు పోగొట్టుకోవ‌ద్ద‌ని చెప్తున్నారు. 

'భూల్ భులయ్యా 3' లో విద్యాబాలన్

ఇక ప్ర‌స్తుతం 'భూల్ భుల‌య్యా - 3'లో న‌టించ‌నున్నారు విద్యాబాల‌న్. దాంట్లో మంజులికగా న‌టించ‌నున్నారు. ఈ విష‌యాన్ని కార్తిక్ ఆర్య‌న్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. విద్యా 'భూల్ భుల‌య్యా' సెట్స్ లోకి వస్తున్నార‌ని చెప్పేందుకు థ్రిలింగ్ గా ఉంద‌ని, ఈ దీపావ‌ళికి నిజ‌మైన ధ‌మాకా అంటూ ట్వీట్ చేశారు కార్తిక్. దాంతో పాటుగా విద్యా బాల‌న్ మంజులికాగా న‌టించిన ఒక వీడియో క్లిపింగ్ ని జ‌త చేశారు ఆ పోస్ట్ కి. 2007లో 'భూల్ భుల‌య్యా' సినిమాలో అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న న‌టించారు విద్యాబాల‌న్. ఆ త‌ర్వాత సెకెండ్ పార్ట్ లో కార్తిక్ ఆర్య‌న్, కియారా అద్వానీ, ట‌బూ న‌టించారు. రెండో పార్ట్ ని అనీస్ బ‌జ్మీ డైరెక్ట్ చేశారు. ఇక ఇప్పుడు మూడో పార్ట్‌కు కూడా ఆయ‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

Also Read: ‘ఆప‌రేష‌న్ వాలంటైన్’, ‘ఫైట‌ర్’ సినిమాల మ‌ధ్య పోలికపై స్పందించిన డైరెక్టర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
U19 Asia Cup Final: భారత్‌కు షాకిచ్చిన బంగ్లా టైగర్లు - అండర్ -19 అసియా కప్ కైవసం
భారత్‌కు షాకిచ్చిన బంగ్లా టైగర్లు - అండర్ -19 అసియా కప్ కైవసం
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Crime News: 'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
Embed widget