Actress Divya Prabha : ఫ్లైట్‌లో హీరోయిన్‌ను వేధించిన పాసింజర్ - ఎయిర్ హోస్టెస్‌కి కంప్లైంట్ చేస్తే అలా చేస్తారా?
Malayalam Actress Divya Prabha : ఫ్లైట్ జర్నీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మలయాళ హీరోయిన్ దివ్య ప్రభ సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పాటు ప్రజల మద్దతు కోరారు.
ఎయిర్ పోర్టుల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఫ్లైట్ జర్నీలో తోటి ప్రయాణికులు ఉంటారు. ఎవరూ ఒంటరి కాదు. చుట్టూ నలుగురు మనుషులు ఉంటారు. ఆ నలుగురి మధ్య మహిళలకు సురక్షిత వాతావరణం ఉండటం లేదు. వాళ్ళకు వేధింపులు తప్పడం లేదు. అందుకు ఉదాహరణ ఈ ఘటన! విమాన ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మలయాళ నటి దివ్య ప్రభ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
విమానంలో దివ్య ప్రభకు వేధింపులు
air india incident : మలయాళంలో పదిహేనుకు పైగా సినిమాల్లో నటించిన అమ్మాయి దివ్య ప్రభ (Malayalam Actress Divya Prabha). తమిళంలో 'కాయల్', 'కొడియల్ వరువన్' సినిమాలు కూడా చేశారు. ఇటీవల ముంబై నుంచి కొచ్చి ఫ్లైట్ జర్నీ చేసిన తనకు విమానంతోటి ప్రయాణికుడి నుంచి వేధింపులు ఎదురు అయ్యాయని దివ్య ప్రభ తెలిపారు.
మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు ముంబై నుంచి కొచ్చి బయలు దేరిన విమానంలో తాను ప్రయాణించానని దివ్య ప్రభ తెలిపారు. తన సీట్ నంబర్ 12 ఏ అని చెప్పారు. మద్యం తాగిన ఒకరు 12 సి నుంచి 12 బి సీటుకు మారి తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు.
''లాజిక్ లేకుండా అతడు నాతో గొడవ పడ్డాడు. ఆర్గ్యుమెంట్ చేశాడు. తప్పు తప్పుగా ప్రవర్తించాడు. అసభ్యంగా తాకాడు. ఈ విషయాన్ని నేను ఎయిర్ హోస్టెస్ దృష్టికి తీసుకు వెళ్ళాను. నాకు మూడు నాలుగు రోస్ ముందు ఉన్న మిడిల్ సీట్ ఇచ్చారు. అంతే తప్ప... వేధింపులకు పాల్పడిన వ్యక్తి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కొచ్చిలో ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా స్టాఫ్, ఎయిర్ పోర్ట్ అధికారులకు కంప్లైంట్ చేశా'' అని దివ్య ప్రభ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెటిజనుల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది.
Also Read : ఏఐను నడిపించేది మనుషులే - సినిమా ఇండస్ట్రీపై ఏఐ ప్రభావం గురించి రానా ఏమన్నారంటే?
దివ్య ప్రభ కంప్లైంట్, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. ఫ్లైట్ జర్నీలో ప్రయాణికుల సంరక్షణ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని దివ్య ప్రభ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎయిర్ పోర్ట్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆమె రిక్వెస్ట్ చేశారు.
Also Read : 'ప్రేమ విమానం' రివ్యూ : 'జీ 5'లో కొత్త సినిమా ఎలా ఉంది? 'విమానం'కి, దీనికి డిఫరెన్స్ ఏంటి?
View this post on Instagram
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
One of the best films of the year, #Ariyippu to premiere at the prestigious BFI London Film Festival on Oct 6, 2022. pic.twitter.com/MffI10hNxm
— Sajin Shrijith (@SajinShrijith) September 1, 2022