Mahesh Babu - Priyanka Chopra: రాజమౌళి సినిమా కోసం... కొత్త రూటులో మహేష్ బాబు, ప్రియాంకతో కలిసి
SSMB29 Latest Update: సూపర్ స్టార్ మహేష్ బాబు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని ఇండస్ట్రీలో చాలామంది చెబుతారు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి కోసం ఆయన కొత్త రూటులోకి వెళుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సింగిల్ టేక్ ఆర్టిస్ట్ - తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చెప్పే మాట ఇది. రిహార్సల్స్ అవసరం లేకుండా ఎటువంటి భారీ డైలాగ్ అయినా సరే చెప్పగల సమర్థులు ఆయన. ఎంత పెద్ద సన్నివేశమైనా సరే అవలీలగా చేసేస్తారు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం మహేష్ బాబు కొత్త రూటులోకి వెళ్తున్నారు. అది ఏమిటో తెలుసా?
ప్రియాంక చోప్రాతో కలిసి...
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించనున్న పాన్ వరల్డ్ సినిమాలో హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆవిడ ఇటీవల హైదరాబాద్ వచ్చారు. చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే... మహేష్ బాబును కూడా ప్రియాంక కలిశారు.
మహేష్ బాబుతో నటించాలని ఉందని బాలీవుడ్ హీరోయిన్లు పలువురు పలు పలు సందర్భాలలో చెప్పారు. అయితే, తెలుగు సినిమాను దాటి మహేష్ బాబు చేస్తున్న మొదటి సినిమా, అది పాన్ ఇండియా / పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయబోయే సినిమాలో ప్రియాంక చోప్రాకు అవకాశం లభించింది. ఇటీవల హీరో హీరోయిన్లు ఇద్దరూ పాల్గొనగా రాజమౌళి ఒక వర్క్ షాప్ నిర్వహించారని సమాచారం.
మహేష్, రాజమౌళి సినిమా (SSMB29) ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలై చాలా రోజులు అయింది. ఆ మధ్య అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజతో లాంఛనంగా సినిమాను ప్రారంభించారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. దానికి ముందే మహేష్, ప్రియాంక వర్క్ షాప్స్ నిర్వహించారు. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ చేయడంతో పాటు ఇద్దరు మీద లుక్ టెస్ట్ కూడా చేశారట రాజమౌళి.
మహేష్ బాబు ఇప్పటి వరకు వర్క్ షాప్స్ వంటి వాటిలో పాల్గొన్నది లేదు. నటన అనేది ఆయన రక్తంలోనే ఉంది. నూనుగు మీసాలు రాకముందే తండ్రి కృష్ణతో కలిసి భారీ సినిమాలు చేశారు. ఇప్పుడు రాజమౌళి కోసం మొదటిసారి వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఇది మహేష్ బాబుకు కొత్త రూటు అని చెప్పాలి. బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాల కోసం రాజమౌళి ఇదే తరహాలో హీరో హీరోయిన్లతో వర్క్ షాప్స్ నిర్వహించిన సంగతి ప్రేక్షకులకు కూడా గుర్తుండే ఉంటుంది.
వచ్చే ఏడాది ఆఖరికి చిత్రీకరణ పూర్తి?
అతి త్వరలో మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ మొదలు కానుంది. వచ్చే ఏడాది ఆఖరికి కల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నారట. రెండు భాగాలుగా సినిమా విడుదల కానుంది అని, 2027లో మొదటి పార్ట్ - 2028లో రెండో పార్ట్ వస్తుందని సమాచారం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

