SSMB29 Update : మహేష్ 'SSMB29' బిగ్గెస్ట్ అడ్వెంచర్ కోసం బిగ్ సెట్... హైదరాబాద్‌లో ఫేమస్ టెంపుల్ క్రియేట్ చేస్తారా?
SSMB29: దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు 'SSMB29' షూటింగ్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కెన్యా నైరోబీలో షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది.

Mahesh Babu's SSMB29 New Schedule In Hyderabad: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వస్తోన్న పాన్ వరల్డ్ రేంజ్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'SSMB29' కోసం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నసంగతి తెలిసిందే. రీసెంట్‌గా కెన్యా నైరోబీలో బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది మూవీ టీం. ఇక కొత్త షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించినట్లు తెలుస్తోంది.
బిగ్గెస్ట్ సెట్... టైట్ సెక్యూరిటీ
ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే సాహస ప్రయాణం 'Globe Trotter'గా మూవీ రూపొందుతుండగా కాస్త డివోషనల్ టచ్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో కాశీ క్షేత్రానికి సంబంధించి ఓ బిగ్గెస్ట్ సెట్ వేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సెట్‌లో మహేష్ బాబుతో పాటు ప్రధాన నటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల సోషల్ మీడియాలో మహేష్ లుక్స్‌కు సంబంధించి పలు లీక్స్ రావడం, షూటింగ్ సెట్ నుంచి ఫోటోలు లీక్ కావడంతో మూవీ టీం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. భారీ సెక్యూరిటీ మధ్య ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 10 వరకూ ఈ షూటింగ్ సాగనున్నట్లు సమాచారం.
Also Read: పవన్ 'OG'కి ముందు చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే
ఆ పుస్తకాల ఆధారంగా...
ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా రాజమౌళి ఓ విజువల్ వండర్‌ను సిల్వర్ స్క్రీన్‌పై క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తుండగా స్టోరీ ఏంటి అనే దానిపై ఇప్పటికే పలు రూమర్స్ వచ్చాయి. తన మూవీ 'Globe Trotter' అంటూ మహేష్ బర్త్ డే సందర్భంగా ఓ స్మాల్ హింట్ ఇచ్చారు జక్కన్న. అంటే సాహస ప్రయాణం. 'ప్రపంచ పర్యాటకుడు' లేదా 'భూగోళాన్ని చుట్టే వ్యక్తి' అని అర్థం. రామాయణంలోని సంజీవని కూడా ఈ సినిమాలో కీలకం అనే రూమర్స్ కూడా వచ్చాయి.
ఈ సినిమా కథ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ మౌనం వీడారు. 'దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్‌కు నేను, రాజమౌళి బిగ్ ఫ్యాన్స్. ఆయన రాసిని పుస్తకాల ఆధారంగానే SSMB29 స్క్రిప్ట్ రాశాను. ఓ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్‌గా రానుంది.' అంటూ చెప్పారు.
నవంబరులో బిగ్ అప్డేట్
ఈ మూవీ నుంచి మహేష్ ప్రీ లుక్ రిలీజ్ కాగా... నవంబరులో ఫస్ట్ లుక్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. అదే రోజున రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే, ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం హాలీవుడ్ రేంజ్‌లో జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. టైటానిక్, అవతార్ వంటి మూవీస్ తెరకెక్కించిన హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా వీటిని రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అదే జరిగితే అంతర్జాతీయ స్థాయిలో కొన్ని కోట్ల మందికి మన తెలుగు సినిమా రీచ్ కానుంది. 120 దేశాల్లో పాన్ వరల్డ్ స్థాయిలో మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ మూవీలో మహేష్‌తో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆర్ మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.





















