This Week Telugu Movies: పవన్ 'OG'కి ముందు చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే
Upcoming Telugu Movies: ఈ వారం పలు చిన్న సినిమాలు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. వీటితో పాటే ఓటీటీల్లోనూ మూవీస్, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి.

This Week Telugu Movies In Theaters OTT Releases In September Third Week 2025: గత వారం థియేటర్లలోకి వచ్చిన మిరాయ్, కిష్కింధపురి ఆడియన్స్‌ను ఫుల్ ఎంటర్‌టైన్ చేశాయి. మరో 10 రోజుల్లో పవర్ స్టార్ పవన్ 'OG' ప్రేక్షకుల ముందుకు రానుండగా... బిగ్ స్టార్ సినిమా ముందు వారం చిన్న సినిమాల సందడి నెలకొంది. ఈ వారం థియేటర్లలో పలు చిన్న సినిమాలు రానుండగా... అటు ఓటీటీల్లోనూ మూవీస్, వెబ్ సిరీస్ అలరించనున్నాయి. మరి ఆ లిస్ట్ ఓసారి చూస్తే...
మంచు లక్ష్మి 'దక్ష'
చాలా రోజుల తర్వాత మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'దక్ష'. తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఆమెనే స్వయంగా ఈ మూవీని నిర్మించారు. వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహించగా... చిత్ర శుక్లా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలో లక్ష్మి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ నెల 19న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
రియల్ సంఘటనలతో 'బ్యూటీ'
తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్, మిడిల్ క్లాస్ ఎమోషన్స్, అందమైన లవ్ స్టోరీ, సస్పెన్స్ అన్నీ కలగలిపి వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'బ్యూటీ'. అంకిత్ కొయ్య, నీలఖి పాత్రా జంటగా నటించిన ఈ మూవీలో నరేష్, వాసుకి కీలక పాత్రలు పోషించారు. శివసాయి వర్దన్ దర్శకత్వం వహించగా... సుబ్రహ్మణ్యం స్టోరీ అందించారు. ఈ నెల 19న సినిమా రిలీజ్ కానుంది.
Also Read: మిరాయ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్... తేజా సజ్జా దూకుడు... దంచి కొట్టిన ఫస్ట్ సండే!
విజయ్ ఆంటోని 'భద్రకాళి'
కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోని లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ 'భద్రకాళి'. తమిళంలో ఆయన నటించిన మూవీస్ అన్నీ తెలుగులో డబ్ అవుతున్నాయి. 'బిచ్చగాడు' తెలుగు ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేశారు విజయ్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ మూవీకి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'అందెల రవమిది'
ఇంద్రాణి దావలూరి ప్రధాన పాత్రలో నటిస్తూనే స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిన మూవీ 'అందెల రవమిది'. 'స్వర్ణకమలం' మూవీ స్ఫూర్తితో దీన్ని తెరకెక్కించగా ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. తనికెళ్ల భరణి, ఆదిత్య మేనన్ కీలక పాత్రలు పోషించారు.
రవి బ్రసూర్ 'వీర చంద్రహాస్'
మ్యూజిక్ డైరెక్టర్ రవి బ్రసూర్ డైరెక్టర్‌గా తెరకెక్కించిన ఫస్ట్ మూవీ 'వీర చంద్రహాస'. ఈయన 'కేజీఎఫ్' మూవీకి మ్యూజిక్ అందించారు. ఇప్పటికే కన్నడలో విడుదలైన ఈ మూవీ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. శిథిల్ శెట్టి, నాగశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా... కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్ చేశారు.
కామెడీ లీగల్ డ్రామా 'జాలీ'
బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీల్లో ఒకటైన 'జాలీ ఎల్ఎల్‌బీ'ల్లో మూడో పార్ట్ 'జాలీ ఎల్ఎల్‌బీ 3' ఈ నెల 19న రిలీజ్ కానుంది. సుభాష్ కపూర్ దర్శకత్వం వహించగా... బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీల్లో వచ్చే మూవీస్/వెబ్ సిరీస్‌లు
- సెప్టెంబర్ 16 - అమెరికానా (అమెజాన్ ప్రైమ్ వీడియో), బ్యాడ్ షబ్బాస్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), జస్ట్ బ్రీత్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), ది నైఫ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), రిలే (అమెజాన్ ప్రైమ్ వీడియో), సీక్రెట్ మాల్ అపార్ట్‌మెంట్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), విచ్ బోర్డ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
- సెప్టెంబర్ 17 - ఇలియో (జియో హాట్ స్టార్), ది మార్నింగ్ షో (సీజన్ 4 - యాపిల్ టీవీ ప్లస్), జెన్ వీ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
- సెప్టెంబర్ 18 - ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (హిందీ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), సిన్నర్స్ (జియో హాట్ స్టార్), బ్లాక్ రాబిట్ (ఇంగ్లీష్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), ప్లాటోనిక్ (నెట్ ఫ్లిక్స్)
- సెప్టెంబర్ 19 - హోస్ మేట్స్ (జీ5), ఇంద్రా (సన్ నెక్స్ట్, Tentkotta), ష్ సీజన్ 2 (ఆహా), పోలీస్ పోలీస్ (వెబ్ సిరీస్ - జియో హాట్ స్టార్), టు మెన్ (మనోరమ మ్యాక్స్), రాండమ్ యామమ్ (మనోరమ మ్యాక్స్), ది ట్రయల్ (సీజన్ 2 - జియో హాట్ స్టార్), ది సర్ఫర్ (లయన్స్ గేట్ ప్లే), సైప్‌డ్ (జియో హాట్ స్టార్), బిలియనీర్స్ బంకర్ (సిరీస్ - నెట్ ఫ్లిక్స్), షీ సెడ్ మే బీ (నెట్ ఫ్లిక్స్), మై లవ్‌లీ లెయర్ (నెట్ ఫ్లిక్స్), హాంటెడ్ హోటల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), ట్రస్ట్ (ప్రైమ్ వీడియో), ఈడెన్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
- సెప్టెంబర్ 20 - 28 ఇయర్స్ లేటర్ (ప్రైమ్ వీడియో)





















