Kishkindhapuri Collection: ఆదివారం అదరగొట్టిన కిష్కింధపురి... మూడో రోజు మరింత పెరిగిన కలెక్షన్లు!
Kishkindhapuri Box Office Collection Day 3: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'కిష్కింధపురి'కి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. మూడో రోజు ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగాయి.

Kishkindhapuri First Weekend Collection: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'కి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఆదివారం ఈ సినిమా అదరగొట్టింది. ఫస్ట్ టైం ఒక్క రోజులో మూడు కోట్ల మార్క్ చేరుకుంది. ఇండియాలో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే?
మూడో రోజు అదరగొట్టిన కిష్కింధపురి
Kishkindhapuri Three Days Collection: సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన కిష్కింధపురి చిత్రానికి మొదటి రోజు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక వైపు 'మిరాయ్' ఉండడంతో తక్కువ థియేటర్లు లభించాయి. అలాగే థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు సంఖ్య సైతం తక్కువగా ఉంది. కానీ తర్వాత నుంచి సినిమా పుంజుకుంది.
'కిష్కింధపురి' చిత్రానికి మొదటి రోజు ఇండియాలో 2.15 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చింది. రెండో రోజు అది 70 లక్షల పెరిగింది. శనివారం ఈ సినిమా 2.85 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు అయినటువంటి ఆదివారం ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగాయి మొదటిసారి ఒక్కరోజులో మూడు కోట్ల మార్క్ చేరుకుంది. ట్రేడ్ వర్గాల ఎర్లీ రిపోర్ట్స్ ప్రకారం 'కిష్కింధపురి' చిత్రానికి ఆదివారం 3.35 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఫైనల్ రిపోర్ట్స్ వచ్చేసరికి మూడున్నర కోట్లు దాటిన ఆశ్చర్యపోనవసరం లేదు.
Also Read: టైర్ 2 హీరోల్లో ఇండస్ట్రీ రికార్డ్.... తేజ సజ్జా 'మిరాయ్' ఖాతాలో రేర్ ఫీట్
మూడు రోజుల్లో కిష్కింధపురి ఇండియా నెట్ కలెక్షన్ చూస్తే 8.35 కోట్ల రూపాయలు. గ్రాస్ విషయానికి వస్తే 10 కోట్లు దాటింది. ఈ సినిమా హారర్ థ్రిల్లర్ జానర్ కావడం కాస్త ప్లస్ అయ్యింది. తేజ సజ్జ 'మిరాయ్' కాంపిటీషన్ తట్టుకుని మరి బాక్సాఫీస్ బరిలో బలంగా నిలబడుతోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్ పతాకం మీద సాహు గారపాటి ప్రొడ్యూస్ చేశారు. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు.





















