Mahesh Babu Range Rover Car : లగ్జరీ కార్ రేంజ్ రోవర్ కొన్న మహేష్ బాబు, రేటెంతో తెలుసా?
ప్రిన్స్ మహేష్ బాబు ఇటీవల బ్రాండెడ్ రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేశారు. ఆ రేంజ్ రోవర్ ధర ఎంత అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Mahesh Babu Range Rover Car : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల బంగారు రంగులో మెరిసే, అద్భుతమైన సరికొత్త రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. ఈ కారుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలకు చెందిన కార్లు ఆయన గారేజీలో ఉండగా... ఇప్పుడు మరో బ్రాండెడ్ కారు వచ్చి చేరింది. అయితే ఈ కారు ధర ఎంత అన్న దానిపై అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు.
మహేష్ బాబు తాజాగా కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ SV ధర దాదాపు రూ. 5. 4 కోట్లు అని టాక్ వినిపిస్తోంది. రేంజ్ రోవర్‌లు అనగానే గుర్తొచ్చేది ప్రముఖులు, ఆ తర్వాత సెలబ్రిటీలే. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోస్ ఈ కార్లను సొంతం చేసుకున్నారు. వారిలో మోహన్‌లాల్, జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖ వ్యక్తులు కూడా ఉండడం చెప్పుకోదగిన విశేషం. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మహేష్ బాబు కూడా చేరారు. బంగారు రంగుతో మెరిసిపోతున్న ఈ రేంజ్ రోవర్.. ప్రస్తుతం భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో, ప్రముఖ మోడల్ కార్లలో ఒకటి.
ఆల్రెడీ మహేష్ బాబు దగ్గర రోల్స్ రాయిస్ ఘోస్ట్, రేంజ్ రోవర్ వోగ్, ఆడి ఎ7, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. తాజాగా రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేశారు. దాంతో మహేష్ గ్యారేజీలో మరో ఖరీదైన కారు చేరింది. .
ఇక మహేష్ బాబు సినిమా విషయాలకొస్తే... ఆయన ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్, భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే నుంచి తప్పుకొన్నారు. ఇక, ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా 'ధమాకా' నటి శ్రీ లీలను కన్ఫర్మ్ చేశారు. సెకండ్ లీడ్ హీరోయిన్‌గా మొన్నటి వరకు సంయుక్తా మీనన్ పేరు వినిపించింది. ఇప్పుడు మీనాక్షి చౌదరి పేరు వినిపిస్తోంది. చూడాలి మరి చివరకు ఆ సెకండ్ హీరోయిన్ పాత్ర ఎవరకి వెళ్తుందో. ఇక ఈ చిత్రాన్ని జనవరి 13, 2024 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read : ఐదేళ్ళ పాటు 'దిల్' రాజును ఆదుకున్న పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ'
'గుంటూరు కారం' సినిమాతో పాటు మహేష్ బాబు.. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోయే చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాను మహేష్ బాబు పుట్టిన రోజూ ఆగస్ట్ 9న ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు మహేష్ మరో హాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రపంచ ఓటీటీ రంగంలో అగ్రస్థానంలో రాణిస్తోన్న 'నెట్ ఫ్లిక్స్' సంస్థతో మహేష్ ఓ భారీ సినిమాను చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ క్రేజీ సినిమాకు ‘ఎవెంజర్స్ : ది ఎండ్ గేమ్’ డైరెక్టర్స్ రుసో బ్రదర్స్ దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం.
Read Also : Mahesh Babu Rajamouli Film: మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సీక్వెల్? - క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial