Ravi Teja- Harish Shankar: మ్యాజికల్ కాంబో మళ్లీ రిపీట్, ముచ్చటగా మూడోసారి రవితేజతో హరీష్ మూవీ
Ravi Teja- Harish Shankar: హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. ముచ్చగా మూడోసారి సినిమా చేస్తున్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
Ravi Teja- Harish Shankar New Movie: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో కలిసి హరీష్ శంకర్ మరో సినిమా చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా ప్రకటించింది. ‘మిరపకాయ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ, హరీష్ కాంబో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం రవి తేజ స్పెషల్ ఫోటో షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.
‘రైడ్’ మూవీకి రీమేక్?
ఈ సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకున్న ‘రైడ్’కి రీమేక్‌గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవగన్ హీరోగా 2018లో ఈ సినిమా వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఐటీ రైడ్స్ లో భాగంగా బిగ్ షాట్ ఇంటికి వెళ్లిన హీరోకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని తట్టుకుని ఎలా డ్యూటీ చేశాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. సూపర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా కథలో తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి హరీష్ తెరకెక్కించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే, ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
View this post on Instagram
రవితేజ మూవీతో హరీష్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ
నిజానికి రవితేజ సినిమాతోనే హరీష్ శంకర్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వీరిద్దరి కాంబోలో ‘షాక్‘ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే, రవితేజ తనకు ‘మిరపకాయ్‘ మూవీలో మరో అవకాశాన్ని ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో కలిసి ‘గబ్బర్ సింగ్‘ సినిమా చేశాడు హరీష్. ఈ సినిమా కూడా చక్కటి విజయాన్ని అందుకోవడంతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. మళ్లీ ఇప్పుడు రవితేజతో కలిసి ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు.
అయోమయంలో రవితేజ, హరీష్ కొత్త సినిమాలు
రవితేజ, హరీష్ శంకర్ తాజాగా చేస్తున్న చిత్రాలు అయోమయ పరిస్థితిలో పడిపోయాయి. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా చేయాలి అనుకున్నారు. కానీ, బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావడంతో క్యాన్సిల్ అయ్యింది. అటు హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో రవితేజ, హరీష్ శంకర్ కలిసి కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించబోతున్నారు.
Read Also: ఇష్టం లేకపోతే చూడకండి, ‘యానిమల్’ విమర్శలపై త్రిప్తి దిమ్రి ఘాటు వ్యాఖ్యలు!