Love You Raa Release Date: లవ్ హారర్ కామెడీలో గీతికా రతన్... రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా స్ఫూర్తితో దర్శకుడు!
Love You Raa Telugu Movie: తెలుగులో హారర్ కామెడీలకు ఆదరణ బావుంటోంది. అయితే హారర్, లవ్, కామెడీ కలబోతగా 'లవ్ యూ రా' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.

హారర్ కామెడీలకు ప్రతి భాషలోనూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే జస్ట్ హారర్, జస్ట్ కామెడీ అన్నట్టు కాకుండా... లవ్ బేస్డ్ హారర్ కామెడీ సినిమా 'లవ్యూ రా' (Love You Raa Telugu Movie) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లేటెస్టుగా ఆ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...
సెప్టెంబర్ 5న 'లవ్ యు రా' విడుదల
Love You Raa Movie Release Date: హారర్ లవ్ కామెడీ 'లవ్ యూ రా'లో యంగ్ హీరోయిన్ గీతికా రతన్ నటించారు. ఆమెకు జంటగా హీరో చిన్నూ యాక్ట్ చేశారు. సముద్రాల సినీ క్రియేషన్స్ పతాకంపై సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మించిన చిత్రమిది. ఇటీవల పాటల్ని విడుదల చేశారు. ఆ ఆడియో లాంచ్ కార్యక్రమంలో మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తునట్టు తెలిపారు.
రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా స్ఫూర్తితో!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా తనకు స్ఫూర్తి అని 'లవ్ యూ రా' దర్శకుడు ప్రసాద్ ఏలూరి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఈ సినిమాను ఈ స్థాయికి తీసుకు వచ్చిన నా టీం అందరికీ థాంక్స్. సినిమా చూసి మెచ్చుకున్న డిస్ట్రిబ్యూటర్ దయానంద్ గారికి థాంక్స్'' అని అన్నారు. ఇక ఈ సినిమాలో 'ఏ మాయ చేశావే పిల్లా', 'వాట్సప్ బేబీ', 'యూత్ అబ్బా మేము', 'దైవాన్నే అడగాలా' పాటలను విడుదల చేశారు.
Also Read: షూటింగులు ఆపితే అడుక్కు తినాలి... కార్మికుల ఆకలి బాధలపై మాట్లాడరే? - నాయకులపై వీఎన్ ఆదిత్య ఫైర్

హీరోగా తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పడంతో పాటు ఈశ్వర్ మంచి పాటలు ఇచ్చారని చిన్నూ తెలిపారు. కృష్ణ సాయి పాత్ర అందర్నీ నవ్విస్తుందని, చంద్ర శేఖర్ గారి పాత్ర బాగా వచ్చిందని అన్నారు. టీమ్ అంతా ఎంతో సరదాగా పని చేశామని, సినిమా అందరికీ నచ్చుతుందని హీరోయిన్ గీతిక రతన్ తెలిపారు. సినిమా చూశాక నచ్చడంతో 'లవ్ యూ రా'తో అసోసియేట్ అయ్యానని నిర్మాతలలో ఒకరైన శ్రీనాథ్ ప్రజాపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో నటుడు కృష్ణ సాయి, దర్శక - నిర్మాత నాగేష్, నాగతేజ తదితరులు పాల్గొన్నారు.
Also Read: అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో రాజమాత... ఐకాన్ స్టార్ సినిమాలో ఫస్ట్ టైమ్!





















