అన్వేషించండి

Allu Arjun: అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో రాజమాత... ఐకాన్ స్టార్ సినిమాలో ఫస్ట్ టైమ్!

AA22xA6 Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో రాజమాత నటిస్తున్నట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు పాన్ ఇండియా రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనతో సినిమా అంటే ఇండియన్ ఆడియన్స్ అందరికీ తెలిసిన ఆర్టిస్టులను తీసుకోవాలి కదా! బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా 'జవాన్' వంటి హిట్ సినిమా తీసిన తమిళ దర్శకుడు అట్లీ కుమార్ (Director Atlee Kumar)కి ఆ విషయం తెలుసు. అందుకే తన సినిమాలోకి రాజమాతను తీసుకు వచ్చారట. 

అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో రమ్యకృష్ణ!
Allu Arjun and Atlee Movie Update: అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'బాహుబలి'లో రాజమాత శివగామి పాత్రలో అద్భుతమైన నటన కనబరచడం మాత్రమే కాదు... సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు రమ్యకృష్ణ. ఇప్పుడు ఆమెను అల్లు అర్జున్ అట్లీ సినిమాలో కీలక‌ పాత్రకు తీసుకున్నారు.

టాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్స్ మహేష్ బాబు, ప్రభాస్, సాయి దుర్గా తేజ్ తదితరుల సినిమాలలో రమ్యకృష్ణ నటించారు. బన్నీ, ఆవిడ కాంబినేషన్‌లో ఫస్ట్ సినిమా ఇది.

అల్లు అర్జున్ జంటగా దీపికా పదుకోన్!
సైన్స్ ఫిక్షన్ కథతో అల్లు అర్జున్ అట్లీ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు? అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి దీపికా పదుకోన్ (Deepika Padukone) నటిస్తున్నారు. ఆవిడ కాకుండా మరొక ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. ఒక పాత్రకు మృణాల్ ఠాకూర్, మరొక హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

Also Readనాలుగు రోజుల్లో 400 కోట్లు... వీకెండ్ తర్వాత నిలబడిందా? ఇండియాలో రజనీ మూవీకి ఎన్ని కోట్లు వచ్చాయ్?

మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే.... ఇందులో ఒక విలన్ రోల్ కూడా ఉందని, ఆ పాత్రకు నేషనల్ క్రష్ రష్మికా మందన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. తండ్రి కొడుకులుగా కనిపిస్తారని, విలన్ రోల్ కూడా ఆయనే చేస్తున్నారని టాక్. అయితే దీపికను తప్ప మరొకరిని తమ సినిమాలోకి తీసుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించలేదు.

అల్లు అర్జున్ అట్లీ సినిమాను సన్ పిక్చర్స్ పతాకం మీద కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'కూలీ'ని ప్రొడ్యూస్ చేసింది కూడా ఆయనే. మరొక భారీ పాన్ ఇండియా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పుష్ప విజయం నేపథ్యంలో అల్లు అర్జున్ మీద ఉత్తరాది ప్రేక్షకులలో కూడా ఆసక్తి నెలకొంది. ఆల్రెడీ 'జవాన్' సినిమాతో అక్కడ హిట్ అందుకున్న అట్లీ ఎటువంటి సినిమా తీస్తారో అనే ఆసక్తి దక్షిణాది ప్రేక్షకులలో ఉంది. ఈ మూవీకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తారని టాక్.

Also Readఊహించని విధంగా పడిపోయిన వసూళ్లు... NTR, Hrithik సినిమాకు బాక్సాఫీస్‌ బరిలో షాక్

టాప్ హెడ్ లైన్స్

Anil Ravipudi Animated Movie : అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Samantha Cooking Show : సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget