Look Back 2024: బాలీవుడ్‌లో ఈ ఏడాది బెస్ట్ విలన్లు... మోస్ట్ డేంజరస్ యూటర్న్ తీసుకున్న హీరోలు వీళ్ళే
హీరోలు విలనిజం చూపిస్తే ఎలా ఉంటుంది? బాలీవుడ్ ఈ ఏడాది చూసింది. 2024లో బాలీవుడ్ స్క్రీన్ మీద డేంజరస్ విలనిజం చూపించిన ఆరుగురు విలన్లు ఎవరో తెలుసా?
నటీనటులకు ఛాలెంజింగ్ రోల్ ఏదైనా ఉందా అంటే అది విలనే. హీరోలుగా కంటే ఇలాంటి పాత్రల్లోనే మంచి యాక్టింగ్ స్కిల్స్ ని కనబరిచే అవకాశం ఉంటుంది. కానీ అందరూ ఇలాంటి నెగిటివ్ రోల్ లో కనిపించడానికి సాహసం చేయరు. ముఖ్యంగా హీరోలుగా మంచి గుర్తింపును దక్కించుకున్న తరువాత అలాంటి పాత్రల జోలికి వెళ్లరు. ఇక ఆడియన్స్ పై స్పెషల్ గా ఎఫెక్ట్ చూపించే ఈ విలన్ రోల్స్ చేయాలంటే తమ కంఫర్ట్ నుంచి నటీనటులు బయటకు రావాల్సిందే. ఈ ఏడాది సైకలాజికల్ థ్రిల్లర్ల నుంచి ఇంటెన్స్ యాక్షన్ డ్రామాల వరకు పలువురు హీరోలు, నటులు విలన్లుగా నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నెగిటివ్ రోల్ లో నటించడమే కాదు, ఆయా పాత్రలతో సినిమాకే హైలెట్ గా నిలిచి మల్టీ టాలెంటెడ్ అని అనిపించుకున్నారు. ఇక 2024లో బాలీవుడ్ విలన్ ఇమేజ్ కి నిర్వచనాన్ని కొత్త అర్థాన్ని చెప్పి, భయంకరమైన విలన్ లుగా కనిపించిన నటులు ఎవరో తెలుసుకుందాం.
'సెక్టార్ 36'లో విక్రాంత్ విలనిజం!
ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది విక్రాంత్ మస్సే గురించి. పక్కింటి అబ్బాయిలా కనిపించే విక్రాంత్ '12th ఫెయిల్' మూవీతో బాగా పాపులర్ అయ్యాడు. సున్నితంగా కనిపించే ఈ నటుడు 'సెక్టార్ 36'లో మాత్రం నెగిటివ్ రోల్ పోషించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ పాత్రలో నటించడం కాదు జీవించాడని చెప్పాలి. దీంతో విక్రాంత్ మస్సే కేవలం హీరోగానే కాదు విలన్ గా కూడా అదరగొట్టగలడు అనిపించుకున్నాడు.
సైతాన్... మాధవన్ మాస్ విలనీ!
ఈ ఏడాది విలన్ గా తమ నటనతో దుమ్మురేపిన హీరోలలో మాధవన్ కూడా ఒకరు. బాలీవుడ్ హర్రర్ మూవీ 'సైతాన్'లో ఆయన నటించిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. కోల్డ్ బ్లడెడ్ విలన్ గా మాధవన్ పోషించిన ఆ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రను మరెవ్వరూ అంతబాగా చేయలేరేమో అనిపిస్తుంది. ఇందులో ఆయన ఇంటెన్స్ యాక్షన్, స్క్రీన్ ప్రజెన్స్ సినిమాని చూస్తున్నంత సేపు సీట్ ఎడ్జ్ ఫీలింగ్ ని ఇస్తాయి. ఇప్పటిదాకా లవర్ బాయ్ గా ఉన్న మాధవన్ ఇమేజ్ ని ఈ మూవీ పూర్తిగా మార్చేసింది.
అభిషేక్ బెనర్జీ అంటే కామెడీ కాదు!
తన కామెడీ టైమింగ్ తో నవ్విస్తూ, ఇప్పటిదాకా సపోర్టింగ్ రోల్స్ తో నెట్టుకొచ్చిన అభిషేక్ బెనర్జీ 'వేద' మూవీతో క్రూరమైన విలన్ గా టర్న్ తీసుకున్నాడు. ఇందులో ఆయన పాత్ర స్పైన్ చిల్లింగ్ థ్రిల్ ఇస్తుంది. ఈ ఏడాది మర్చిపోలేని విలన్లలో అభిషేక్ బెనర్జీ కూడా ఒకరు. ఆఫ్ బీట్ పాత్రలతో ఆకట్టుకునే గుల్షన్ దేవయ్య ఈ ఏడాది 'ఉలాజ్' సినిమాలో విలన్ పాత్రతో ఆకట్టుకున్నారు.
Also Read: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
విలనిజంలో అర్జున్ కపూర్ సింహగర్జన
హ్యాండ్సమ్ హీరోగా ఇప్పటిదాకా బాలీవుడ్ లో కొనసాగిన అర్జున్ కపూర్ 'సింగం రిటర్న్స్' మూవీతో విలన్ గా యూటర్న్ తీసుకున్నారు. ఈ ఏడాది ప్రేక్షకులకు మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చిన హీరోలలో అర్జున్ కపూర్ కూడా ఒకరు. ఈ మూవీలో విలన్ గా నటించిన అర్జున్ కపూర్... 'సింగం రిటర్న్స్'లో హీరో అజయ్ దేవగన్ కి పర్ఫెక్ట్ విలన్ అనిపించుకున్నారు.
కిల్... రాఘవ్ జుయల్‌ను ఎలా మర్చిపోతాం!
కమెడియన్ గా పాపులర్ అయిన రాఘవ జుయల్ 'కిల్' మూవీలో దయా, జాలి లేని అత్యంత క్రూరమైన విలన్ గా కనిపించాడు. ఓవైపు సరదా సరదా పంచులు వేస్తూనే, తెరపై రక్తపాతాన్ని సృష్టించి ప్రేక్షకులను విస్మయానికి గురి చేశాడు. మొత్తానికి తాను నవ్వించడం మాత్రమే కాదు ఎలాంటి పాత్రలోనైనా సరే చేయగలను అని నిరూపించారు.
Also Read: 'మ్యాక్స్' రివ్యూ: మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కిచ్చా సుదీప్ - మరి సినిమా హిట్టా? ఫట్టా?