By: ABP Desam | Updated at : 01 Apr 2023 08:02 PM (IST)
రాజేంద్ర ప్రసాద్, అర్చన
'సుజాతా....మై మర్ జాతా' - ఈ డైలాగ్ గుర్తుందా? తెలుగు ప్రేక్షకులు దీనిని అంత సులభంగా మర్చిపోలేరు. 'లేడీస్ టైలర్'లో 37 ఏళ్ళ క్రితం విడుదలైనప్పుడు ఆ డైలాగ్ ఓ సెన్సేషన్! ఆ సినిమాలో నట కిరిటీ డా. రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad Actor) నటన, ఆయన డైలాగ్ డెలివరీ ట్రెండ్ సెట్ చేశాయి. అందులో సుజాత (Actress Sujatha) హీరోయిన్. మళ్ళీ 37 ఏళ్ళ తర్వాత రాజేంద్ర ప్రసాద్, సుజాత మళ్ళీ ఓ సినిమా కోసం రీయూనియన్ అయ్యారు.
ఇళయరాజా సంగీతంలో...
రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో మా ఆయి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'షష్టిపూర్తి' (Shastipoorthi Movie). ఇందులో రూపేష్ కుమార్ చౌదరి హీరో. కథానాయకుడిగా నటించడంతో పాటు సినిమాను నిర్మిస్తున్నారు. ఆయనకు జోడీగా కథానాయిక ఆకాంక్షా సింగ్ (Akanksha Singh) నటిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ ప్రభ దర్శకుడు.
చెన్నైలోని లెజెండరీ సంగీత దర్శకుడు, ఇసైజ్ఞాని ఇళయరాజా (Isaignani Ilayaraja) స్టూడియోస్‌లో ఈ రోజు పూజా కార్యక్రమాలతో 'షష్టిపూర్తి' ఈ చిత్రం ప్రారంభమైంది. సినిమాకు ఆయన సంగీతం అందిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ఇళయరాజా కెమెరా స్విచాన్ చేయగా... సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్‌బి చౌదరి క్లాప్ ఇచ్చారు.
ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్...
జూలైలో ప్రేక్షకుల ముందుకు
'షష్టిపూర్తి' రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో స్టార్ట్ చేస్తున్నామని, జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని సినిమా హీరో, నిర్మాత రూపేష్ కుమార్ చౌదరి (Rupesh Kumar Chaudhary) తెలిపారు. సినిమా ప్రారంభమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''రాజేంద్ర ప్రసాద్ గారు, ఇళయరాజా గారు, అర్చన మేడమ్ వంటి గొప్ప వాళ్ళతో సినిమా చేసే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. 'లేడీస్ టైలర్' తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన నటిస్తున్న చిత్రమిది'' అని చెప్పారు.
ఇళయరాజాతోనూ హిట్ కాంబినేషనే
రాజేంద్ర ప్రసాద్, అర్చన నటించిన 'లేడీస్ టైలర్'కు ఇళయరాజా సంగీతం అందించారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్, ఇళయరాజా కలయికలో మంచి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. 'ఆస్తులు అంతస్థులు', 'చెట్టు కింద ప్లీడర్', 'ఏప్రిల్ 1 విడుదల' సినిమాలు, వాటిలో పాటలూ హిట్టే. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ కాంబినేషన్ కూడా రిపీట్ అవుతోంది. సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయని, ఇళయరాజా మంచి బాణీలు సిద్ధం చేస్తున్నారని రూపేష్ కుమార్ చౌదరి తెలిపారు.
Also Read : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి
రాజేంద్ర ప్రసాద్, అర్చన ఓ జంటగా... రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్ మరో జంటగా నటిస్తున్న 'షష్టిపూర్తి'లో 'కాంతార' ఫేమ్ అచ్యుత్ కుమార్, వై. విజయ, 'శుభలేఖ' సుధాకర్ ఇతర తారాగణం. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ : అయేషా మరియం, పబ్లిసిటీ డిజైనర్ : అనిల్ భాను, కూర్పు : కార్తీక శ్రీనివాస్, కళా దర్శకత్వం : తోట తరణి, నృత్య దర్శకత్వం : బృందా, సాహిత్యం : చైతన్య ప్రసాద్ & రెహమాన్, ఛాయాగ్రహణం : రామిరెడ్డి, సంగీతం: మాస్ట్రో ఇళయరాజా.
Also Read : గోపికమ్మ... ఎల్లువొచ్చి గోదారమ్మ... ఇప్పుడు బతుకమ్మ - బుట్ట బొమ్మ హిట్ సాంగ్స్!
Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి
Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా
Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?
Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?
‘విమానం’ ఎలా ఉంది? అనసూయను తిట్టిస్తున్న విజయ్? - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్