Bigg Boss Shivaji Re-Entry: విచిత్రమైన కథతో వస్తున్న 'బిగ్‌బాస్' శివాజీ - చాలా గ్యాప్ తర్వాత 'కూర్మ నాయకి'తో రీఎంట్రీ..
Actor Shivaji Re-Entry: చాలా గ్యాప్ తర్వాత బిగ్‌బాస్ శివాజీ వెండితెరపై గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న కూర్మ నాయకిలో కీ రోల్ చేయబోతున్నాడు.
Actor Shivaji Re-Entry: నటుడు శివాజీ బిగ్ బాస్ రియాలిటీ షోలో అలరించాడు. నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన అతడు పలు చిత్రాల్లో హీరోగా మెప్పించి హిట్లు కొట్టాడు. అప్పట్లో ఆడపదడపా సినిమాలు చేస్తూ వచ్చిన శివాజీ కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యాడు. ఈ క్రమంలో కాస్తా గ్యాప్ తీసుకున్న శివాజీ రీసెంట్‌గా ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌లో సందడి చేశారు. తనదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. మైండ్ గేమ్ ఆడుతూ ఆడియన్స్ ఆదరణ దక్కించుకున్నాడు. అలా 15 వారాలతో పాటు హౌజ్‌లో కొనసాగిన శివాజీ టైటిల్ కొడతాడనుకుంటే టాప్ 3లో నిలిచి ఫైనల్లో వెనుదిరిగారు.
ఇక బిగ్‌బాస్ తెచ్చిన క్రేజ్‌తో ఇప్పుడు శివాజీ వెండితెరపై మరోసారి అలరించబోతున్నాడు. అదీ కూడా ఓ సరికొత్త కంటెంట్‌తో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చింది. కాగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఒక హార్రర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కబోతుంది. ‘కూర్మ నాయకి’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమాతో హర్ష కడియాల డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. ఇతను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడని తెలుస్తుంది.
శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నారు. ఎంఎం క్రియేషన్స్ బ్యానర్ లో మొదటి సినిమాగా విజిత్ రావు కూర్మ నాయకి నిర్మించబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శివాజీ కీ రోల్ చేయబోతున్నట్టు మూవీ టీం నుంచి అధికారిక ప్రకటించింది. తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ శివాజీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. ఈ మోషన్ పోస్టర్‌ను పరిచయం శివాజీ మాట్లాడాడు.
'సరికొత్త శివాజీని చూడబోతున్నారు'
ఈ పోస్టర్ చివర్లో శివాజీ మాట్లాడుతూ.. "హాయ్ అందరికి. మీరు చూసిన 'కూర్మ నాయకి' మోషన్ పోస్టర్ మీ అందరికి నచ్చిందని అనుకుంటా. ఈ సంక్రాంతి సందర్భంగా మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు. నా రీఎంట్రీలో నేను నటించబోతున్న నా మొట్టమొదటి సినిమా ఇది. ఇందులో నేను ఏం చేయబోతున్నాను, నేను ఎలా ఉండబోతున్నాను.. త్వరలోనే నా క్యారెక్టర్, దాని డిజైన్స్, మోషన్ పోస్టర్.. నా ఎంట్రీ అన్ని కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇందులో మీరు సరికొత్త శివాజీని చూడబోతున్నారు" అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో శివాజీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలిసి అతడి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో శివాజీ లుక్ కోసం వేయిటింగ్ అంటూ ఈ మోషన్ పోస్టర్‌పై స్పందిస్తున్నారు.
విచిత్రమైన కథగా 'కూర్మ నాయకి'
సాధారణంగా మనుషులకు దొంగలు నుంచి సమస్యలు, దెయ్యాల వల్ల భయం కలిగిన వెంటనే దేవుడిని వేడుకుంటారు. తమ ధైర్యం ప్రసాదించమని ప్రార్థిస్తారు. ఇది అందరికి తెలిసిందే. నిజానికి ఎలాంటి, ఎంతటి పెద్ద సమస్యైనా తీర్చేది దేవుడే అనేది మనుషుల విశ్వాసం. అలాంటిది దేవుడికే సమస్య వస్తే.. అది కూడా మనుషులు వల్లే సమస్య ఎదురైతే.. వంటవి విచిత్రమైన కథను పరిచయం చేయబోతున్నాడు హర్ష కడియాల.
Also Read: అయోధ్య రామామందిరానికి దగ్గర్లో భూమి కొన్న అమితాబ్ - త్వరలో సొంత ఇంటి నిర్మాణం, ఎన్ని కోట్లంటే?