Krithi Shetty: నందమూరి హీరోకి జోడిగా కృతి శెట్టి... కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్!
Krithi Shetty Upcoming Telugu Movie: నందమూరి హీరో సరసన నటించే అవకాశాన్ని అందుకుంది కృతి శెట్టి. ఆ విషయాన్ని స్వయంగా దర్శకుడు అనౌన్స్ చేశారు. ఆ సినిమా ఏది? అనే విషయంలోకి వెళితే...

'ఉప్పెన'తో కథానాయికగా పరిచయమైన అందాల భామ కృతి శెట్టి. తర్వాత తమిళ్, మలయాళ సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అయితే... అక్కినేని నాగ చైతన్య 'కస్టడీ' తర్వాత తెలుగు తెరపై మళ్ళీ కనిపించలేదు. ఆ సినిమా వచ్చి మూడేళ్ళు అవుతోంది. మధ్యలో డబ్బింగ్ సినిమాలతో పలకరిస్తున్నా... వచ్చే సంక్రాంతికి మాత్రం తెలుగు సినిమాతో థియేటర్లలో సందడి చేయడం గ్యారెంటీ. ఆ విషయాన్ని స్వయంగా దర్శకుడు కన్ఫర్మ్ చేశారు. నందమూరి హీరో సరసన బెబమ్మ నటించనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
కళ్యాణ్ రామ్ జంటగా కృతి శెట్టి!
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన 'పటాస్'తో అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి కలయికలో ఒక్క సినిమా కూడా కాలేదు. కానీ, విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కలయికలో నాలుగు భారీ హిట్స్ వచ్చాయి. 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం'తో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగ రాశారు. మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'లో కూడా వెంకటేష్ నటించారు.
'మన శంకర వరప్రసాద్ గారు' తర్వాత మరోసారి వెంకటేష్, అనిల్ రావిపూడి కలిసి సినిమా చేస్తున్నారు. అది మల్టీస్టారర్. అందులో నందమూరి కళ్యాణ్ రామ్ మరొక హీరో. ఆయనకు జంటగా ఈ సినిమాలో కృతి శెట్టి నటించనున్నారు.
Also Read: Trisha: త్రిష ప్రేమ పలుకులు... విజయ్ కోసమా? సంగీతకు కౌంటరా?
View this post on Instagram
తమిళ యువ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన న్యూ ఏజ్ సినిమా 'ఎల్‌ఐకే' (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)ను తెలుగులోనూ ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్‌కు అనిల్ రావిపూడి వచ్చారు. స్టేజిపై ''త్వరలో సెట్స్‌లో కలుద్దాం'' అంటూ కృతి శెట్టికి చెప్పారు. దాంతో అది ఏ సినిమా అనేది అందరికీ అర్ధమైంది.
Also Read: Peddi: 'పెద్ది' నైజాం రైట్స్... రేటు ఫిక్స్ కానీ ట్విస్ట్ ఉంది గురూ
నా తర్వాత సినిమాలో క్రితి యాక్ట్ చేస్తున్నట్లు ఆల్రెడీ రాసేశారు. See you soon on sets.
— idlebrain.com (@idlebraindotcom) April 5, 2026
- Anil Ravipudi#LIK pic.twitter.com/fu7qHyFdwX
వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాను షైన్ స్క్రీన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుందీ సినిమా. దీనికి భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్.
Also Read: TN 2026 Vijay: వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్
ట్రెండింగ్ వార్తలు





















