Peddi: 'పెద్ది' నైజాం రైట్స్... రేటు కట్టారు కానీ బయటకు ఇవ్వలేదు!
Peddi Nizam Rights: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'పెద్ది' నైజాం రైట్స్ వేల్యూ ఫిక్స్ చేశారు. బయటకు ఇవ్వలేదు కానీ ఒక రేటు కట్టారు. ఆ డీల్ డీటెయిల్స్‌లోకి వెళితే...

Ram Charan Peddi Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. ఈ నెల (ఏప్రిల్) 30న థియేటర్లలోకి తీసుకు రావాలనేది ప్లాన్. అయితే వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. 'రాకాస' టీంను కలిసినప్పుడు 'పెద్ది' లేట్ అవ్వడం లేదని రామ్ చరణ్ చెప్పమన్నారు. కానీ, ఏప్రిల్ 30న రిలీజ్ అనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతానికి అయితే సినిమా రిలీజ్ డేట్ అదే. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమా నైజాం రైట్స్ డీల్ క్లోజ్ అయ్యింది.
రైట్స్ బయటకు ఇవ్వలేదు కానీ!
నైజాంలో భారీ బడ్జెట్ స్టార్ హీరోస్ సినిమాలు రిలీజ్ చేసే డిస్ట్రిబ్యూటర్స్ అంటే ముందుగా 'దిల్' రాజు, సురేష్ బాబు - ఏషియన్ ఫిలిమ్స్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ పేర్లు వినబడతాయి. ఇతరులు కూడా రిలీజ్ చేస్తున్నారు కానీ... ఎక్కువ శాతం సినిమాలు విడుదల చేస్తున్నది వీళ్ళే. 'పెద్ది'ని నైజాంలో రిలీజ్ చేసేది ఈ ముగ్గురిలో ఒక్కరే.
Also Read: TN 2026 Vijay: వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్
'పెద్ది' నైజాం రైట్స్ బయటకు ఇవ్వలేదు. వృద్ధి సినిమాస్ అధినేత వెంకట్ సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. సినిమాను ప్రజెంట్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌కు చెందిన మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నైజాం రైట్స్ తీసుకుంది. డీల్ వేల్యూ 63 కోట్ల రూపాయలు అని టాక్.
'పెద్ది'కి టికెట్ రేట్ హైక్ లేకపోతే?
Peddi nizam rights price value: 'పెద్ది' నైజాం రైట్స్ వేల్యూ 63 కోట్లుగా లెక్క కట్టారు. అయితే... ఇక్కడ ఒక మెలిక ఉంది. సినిమాకు తెలంగాణలో టికెట్ రేట్ హైక్ గనుక లేకపోతే ఆ రేటులో పది నుంచి పదిహేను శాతం తగ్గించే అవకాశం ఉందట. ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్'ను ఎటువంటి టికెట్ రేటు హైక్ లేకుండా నైజాంలో విడుదల చేసింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. మరి, 'పెద్ది'కి ఎటువంటి స్టాండ్ తీసుకుంటుందో?
Also Read: Suriya - Tovino Thomas: సూర్య మార్చాడు... టోవినో థామస్ మార్చే ఛాన్స్ లేనట్టే!
'పెద్ది'లో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా... ఇతర కీలక పాత్రల్లో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు, కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, లెజెండరీ నటుడు జగపతి బాబు, 'మీర్జాపూర్' ఫేమ్ దివ్యేందు శర్మ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన 'చికిరి చికిరి...', 'రా రా రై రై' చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు






















