News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

మణిరత్నం నుంచి శంకర్ వరకు.. ఒక్కచోట చేరిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ - 'అష్ట దర్శకుల' ఫ్రేమ్ అదిరిందిగా!

తమిళ దర్శకులంతా ఒకచోట చేరారు. మణిరత్నం, శంకర్, లోకేష్ కనగరాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్ వంటి పలువురు ప్రముఖులు కలిసి ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.

FOLLOW US: 
Share:

సినీ ఇండస్ట్రీలో నటీనటులు, దర్శకుల మధ్య ఎంత పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అది ఆహ్లాదకరమైన పోటీ మాత్రమే అని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. అందరూ ఎంతో సన్నిహితంగా ఉంటారు.. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సినిమా సక్సెస్ అయినప్పుడు ఒకరినొకరు అభినందించుకోవడమే కాదు, వీలు చిక్కినప్పుడల్లా కలిసి పార్టీలు చేసుకుంటారు. ఒకప్పుడు ఇంటర్నెట్ విస్తృతంగా లేదు కాబట్టి ఇవేవీ బయటకు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడలా కాదు. ప్రతీదీ సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, తమిళ దర్శకులు అందరూ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. 

కోలీవుడ్ లో ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ గా వెలుగొందుతున్న మణిరత్నం, శంకర్ షణ్ముగం, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఏఆర్ మురగదాస్, లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజు, లింగుస్వామిలు ఒక్కచోట చేరారు. వీరంతా ఇటీవల చెన్నైలో సమావేశమై కాసేపు ముచ్చటించారు.. కలిసి గ్రూప్ ఫోటోకి పోజులిచ్చారు. ఈ బ్లాక్ బస్టర్ ఫోటోని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. "వాట్టేయ్ లవ్లీ ఈవినింగ్...." అని క్యాప్షన్ పెట్టాడు. వీరంతా తన అప్ కమింగ్ సినిమాల గురించి మాట్లాడుకున్నారో, ఇండస్ట్రీ అభివృద్ధి గురించి డిస్కస్ చేసారో, క్యాజువల్ గా కలిసారో కచ్చితంగా తెలియదు కానీ.. ఈ 'తమిళ అష్ట దర్శకుల' పిక్ మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. 

తమిళ దర్శకుల మధ్య మంచి అవగాహన ఉందనడానికి ఈ ఫోటో నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నేటి తరం టాలీవుడ్ దర్శకులు, నటీనటులు కూడా ఇలాంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తరచుగా కలుస్తూ పార్టీలు చేసుకుంటున్నారు. గతంలో అనేక సందర్భాల్లో వీరంతా కలిసి కనిపించారు. అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, సుకుమార్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, వేణు శ్రీరామ్, బాబీ, బుచ్చిబాబు తదితరులు ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో ఒకటి వైరల్ అయింది. అలానే ఇప్పుడు కోలీవుడ్ దర్శకుల రేర్ పిక్ ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. 

Also Read: 'OMG 2' ట్రైలర్: శివుడి అండతో న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన భక్తుడు - సున్నితమైన అంశాన్ని టచ్ చేసిన 'ఓఎంజీ 2'

ఇక వీరి సినిమాల విషయానికి వస్తే, శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్‌ హీరోగా 'గేమ్ ఛేంజర్' అనే పాన్ ఇండియన్ సినిమాతో బిజీగా ఉన్నారు. కార్తీక్ సుబ్బరాజు అందించిన స్టోరీ లైన్ తోనే ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. అదే సమయంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో 'ఇండియన్ 2' సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు శంకర్. లోకేష్ కనగరాజ్ ఇప్పుడు తలపతి విజయ్ తో 'లియో' అనే పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 

కార్తీక్ సుబ్బరాజ్ ప్రెజెంట్ రాఘవ లారెన్స్, ఎస్.జె సూర్య లతో 'జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌' అనే సినిమా చేస్తున్నారు. యాక్టింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్.. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న 'ధృవ నచ్చతిరమ్' చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చియాన్ విక్రమ్ హీరోగా నటించారు. 'పొన్నియిన్ సెల్వన్' తర్వాత లెజండరీ దర్శకుడు మణిరత్నం ఇంకా తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించలేదు. అయితే కమల్ హాసన్‌ తో సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రజినీకాంత్ 'దర్బార్' తర్వాత ఏఆర్ మురుగదాస్ మరో మూవీని డైరెక్ట్ చేయలేదు. కాకపోతే తన సమర్పణలో కొన్ని సినిమాలను రిలీజ్ చేసారు. 'వారియర్' డిజాస్టర్ గా మారిన తర్వాత లింగుస్వామి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ప్రకటన చేయలేదు.

Also Read: క్రేజీ అప్డేట్స్‌తో రాబోతున్న స్టార్ హీరోలు, ఈ నెల ఫ్యాన్స్‌కు పండగే పండగ!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 04 Aug 2023 04:03 PM (IST) Tags: Shankar Mani Ratnam AR Murugadoss Gautham Vasudev Menon lokesh kanagaraj Karthik Subbaraj N Linguswamy Kollywood Star Directors

ఇవి కూడా చూడండి

Lokesh Kanagaraj Fight Club : ఫైట్​క్లబ్​తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్​గా మాత్రం కాదు

Lokesh Kanagaraj Fight Club : ఫైట్​క్లబ్​తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్​గా మాత్రం కాదు

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!

Ram Charan: ‘ఓటు’ కోసం షూటింగ్ ఆపేసిన చరణ్, ఇంటికి తిరుగు ప్రయాణం

Ram Charan: ‘ఓటు’ కోసం షూటింగ్ ఆపేసిన చరణ్, ఇంటికి తిరుగు ప్రయాణం

Mahesh Babu Animal Trailer: ‘యానిమల్’లో రణబీర్‌కు బదులు మహేష్ నటిస్తే, ఇదిగో ఇలా ఉంటుందట, డీప్ ఫేక్ వీడియో వైరల్

Mahesh Babu Animal Trailer: ‘యానిమల్’లో రణబీర్‌కు బదులు మహేష్ నటిస్తే, ఇదిగో ఇలా ఉంటుందట, డీప్ ఫేక్ వీడియో వైరల్

Rules Ranjann: ‘రూల్స్ రంజన్’ ఓటీటీ అప్డేట్ - ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అంటే?

Rules Ranjann: ‘రూల్స్ రంజన్’ ఓటీటీ అప్డేట్ - ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అంటే?

టాప్ స్టోరీస్

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Singanamala Politics: ఏపీలో ఈ నియోజకవర్గం చాలా స్పెషల్! ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం, ఇదే చంద్రబాబుకి తలనొప్పి!

Singanamala Politics: ఏపీలో ఈ నియోజకవర్గం చాలా స్పెషల్! ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం, ఇదే చంద్రబాబుకి తలనొప్పి!

Bigg Boss Telugu 7: గౌతమ్‌కు ప్రియాంక సపోర్ట్ - వెధవను అయిపోయాను అంటూ అమర్ సీరియస్

Bigg Boss Telugu 7: గౌతమ్‌కు ప్రియాంక సపోర్ట్ - వెధవను అయిపోయాను అంటూ అమర్ సీరియస్

Telangana Elections 2023 : తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ - అదేమిటో తెలుసా ?

Telangana Elections 2023 :  తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -  అదేమిటో తెలుసా ?