Ajith Kumar : ఫ్యాన్స్ యాక్షన్‌తో లైఫ్స్ రిస్క్... ఆ వార్తలు చూసి షాకయ్యా - కోలీవుడ్ స్టార్ అజిత్
Ajith Kumar Reaction : అభిమానుల యాక్షన్ వల్ల ఒక్కోసారి లైఫ్స్ రిస్క్‌లో పడతాయని అన్నారు తమిళ స్టార్ అజిత్. ప్రతీ సినిమాను తన ఫస్ట్ సినిమాలాగే భావిస్తానని చెప్పారు.

Ajith Kumar About His Child And Career : ఫ్యాన్స్ చర్యల వల్ల ఒక్కోసారి అందరి జీవితాలు రిస్క్‌లో పడతాయని కోలీవుడ్ స్టార్ అజిత్ అన్నారు. తాజాగా ఓ ఆంగ్ల ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన... తన పిల్లలు, కెరీర్, పాషన్‌తో పాటు ఫ్యాన్స్ గురించి మాట్లాడారు. దీంతో పాటే తమిళనాడు కరూర్ ఘటన గురించి కూడా స్పందించారు.
అందరి జీవితాలు రిస్క్‌లో పడతాయి
తన పిల్లలను ఒక్కసారి కూడా స్వయంగా స్కూల్ దగ్గరకు డ్రాప్ చేసేందుకు వెళ్లలేదని అజిత్ అన్నారు. 'నా పిల్లలు వాళ్ల స్కూల్ దగ్గరికి రావాలని కోరతారు. కానీ, నేను ఒక్క రోజు కూడా వాళ్లను డ్రాప్ చేసేందుకు వెళ్లలేదు. ఒకవేళ నేను అలా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే కనీసం 50, 60 మంది బైక్‌పై నన్ను ఫాలో అవుతూ ఫోటో కావాలని అడుగుతారు. అభిమానుల చర్యల వల్ల ఒక్కోసారి అందరి జీవితాలు రిస్క్‌లో పడతాయి. కారులో నుంచి ఫోటోలు ఇచ్చే టైంలో నా చేతికి గాయాలైన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.' అని అన్నారు.
#AjithKumar gets emotional while talking about his kids ❣️:
— Laxmi Kanth (@iammoviebuff007) October 31, 2025
"I've had my son and my daughter cry, saying that Papa, Why can't you be like other fathers coming to school and dropping us off.. It gets....🥺"pic.twitter.com/XitCUKVYwN
Also Read : 'మాస్ జాతర' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - మాస్ మహారాజ మూవీ ఏ ప్లాట్ ఫామ్‌లోకి వస్తుందంటే?
ఫ్యాన్స్‌కు రుణపడి ఉంటా
తాను ఇప్పటికి కూడా ప్రతీ సినిమాను ఫస్ట్ సినిమాగానే భావిస్తానని... బ్లాక్ బస్టర్ విజయాలు వచ్చినా, ఫెయిల్యూర్స్ వచ్చినా వాటి గురించి ఆలోచించనని అజిత్ చెప్పారు. 'ఫస్ట్ సినిమా కోసం దర్శక నిర్మాతలు నన్ను 100 రోజుల కాల్షీట్స్ అడిగారు. అలా నేను వాళ్లకు 33 ఏళ్ల నుంచి డేట్స్ ఇస్తూనే ఉన్నా. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న నా ఫ్యాన్స్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా భార్య సపోర్ట్ లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడినే కాదు.' అని తెలిపారు.
ఆ వార్తలు చూసి షాక్ అయ్యా
ఓసారి తమిళనాడు ఎన్నికల టైంలో తనపై వచ్చిన ఓ వార్తను చూసి షాక్ అయినట్లు అజిత్ చెప్పారు. పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓ అభిమానిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్త అప్పట్లో వైరల్ అయ్యింది. దీనిపై ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. '2021 తమిళనాడు ఎన్నికల టైంలో నేను ఓటు హక్కు వినియోగించుకునేందుకు షాలినితో కలిసి పోలింగ్ బూత్‌కు వెళ్లాను. అక్కడికి వచ్చిన సెలబ్రిటీలందరినీ ఓ వ్యక్తి క్యూ లైన్లో ఉండి ఫోటోలు తీస్తున్నాడు.
ఆ పోలింగ్ కేంద్రంలో ఫోటోలు తీయడానికి వీల్లేదు అని అప్పటికే బోర్డులు పెట్టారు. అయినా సరే అతను అవేవీ పట్టించుకోకుండా అందరినీ ఫోటోలు తీస్తున్నాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో అతని ఫోన్ తీసుకుని అక్కడి సిబ్బందికి ఇచ్చాను. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా... అందరూ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశానంటూ నెగిటివ్‌గా రాశారు. ఆ వార్తలు అలా చూసి చాలా షాకయ్యా.' అని వెల్లడించారు.
Civility and duty of all in public places, so well articulated by superstar Ajith Kumar!
— Keh Ke Peheno (@coolfunnytshirt) November 1, 2025
Thala for a reason!pic.twitter.com/ONtbwQGqjq





















