అన్వేషించండి

K RAMP Glimpse: 'ది రిచ్చెస్ట్ చిల్లర్ గయ్'గా కిరణ్ అబ్బవరం - ఫన్నీగా 'కె ర్యాంప్' గ్లింప్స్

Kiran Abbavaram K RAMP: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ 'కె ర్యాంప్' నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎనర్జిటిక్ మాస్ లుక్‌లో కిరణ్ అదరగొట్టారు.

Kiran Abbavaram's K RAMP Glimpse Released: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీ 'కె ర్యాంప్'. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. తాజాగా, మూవీ నుంచి 'రిచెస్ట్ చిల్లర్ గయ్' గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. కేరళలో ఓ తెలుగు కుర్రాడి అల్లరిని ఫన్నీ, ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. గత చిత్రాలతో పోలిస్తే మాస్ లుక్, ఎనర్జిటిక్ డైలాగ్స్‌తో అదరగొట్టారు కిరణ్ అబ్బవరం.

ఎనర్జిటిక్ గ్లింప్స్... ఫుల్ జోష్

'చేటలు ఎల్లారుకూ నమస్కారం.. ఈసారి ఒక్కొక్కరికీ బుర్ర పాడు... జారుడే' అనే కిరణ్ డైలాగ్‌తో గ్లింప్స్ ప్రారంభం కాగా... కిరణ్ తనదైన మాస్ లుక్‌తో అదరగొట్టారు. మాస్ ఆటిట్యూడ్ ఉన్న కుమార్ అనే యువకుడిగా ఆయన కనిపించనుండగా... చిల్ కావడంలో అతనికి పోటీ లేదనేలా ఎనర్జిటిక్‌గా కనిపించారు.

గ్లింప్స్ క్లైమాక్స్‌లో 'మనం ఏఎంబీ సినిమాలో మలయాళ ప్రేమకథలు చూసి హిట్ చేస్తాం. కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే ఆ సినిమాల్లో ఉండే ఆంథెటిసిటీ మన సినిమాల్లో ఉండదు. ప్రేమ మాత్రం బాగుండాలని కోరుకుంటాం..' అంటూ కిరణ్ చెప్పిన డైలాగ్ హైప్ క్రియేట్ చేస్తోంది. అయితే, గ్లింప్స్‌లో కిరణ్ చెప్పే డైలాగ్స్ అక్కడక్కడ కొన్ని వర్డ్స్ ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి.

ఈ మూవీని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మక్ సంయుక్తంగా నిర్మిస్తుండగా... ఈ సినిమాతోనే జైన్స్ నాని దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. కిరణ్ సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు నరేష్,సాయికుమార్,వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: 'శ్రీకృష్ణదేవరాయ' To 'జై హనుమాన్' - 5 మైథలాజికల్ మూవీస్‌లో 'కాంతార' రిషబ్ శెట్టి... ఇంట్రెస్టింగ్ లైనప్ చూశారా!

దీపావళికి రిలీజ్

ఈ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్ కానుంది. సినిమా గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి కిరణ్ (Kiran Abbavaram) హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు. 'క' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం లాస్ట్ మూవీ 'దిల్ రూబ' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. డిఫరెంట్ యూత్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. 

వరుస మూవీస్ 

కిరణ్ హీరోగా లవ్ ఎంటర్‌టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ తెరకెక్కుతుండగా... రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సరసన శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. 'కే ర్యాంప్‌' మూవీతో పాటు 'క' సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mrunal Thakur : ఆ డైరెక్టర్ వల్లే తెలుగు ఇండస్ట్రీకి వచ్చా - 'సీత' రోల్‌పై మృణాల్ రియాక్షన్
ఆ డైరెక్టర్ వల్లే తెలుగు ఇండస్ట్రీకి వచ్చా - 'సీత' రోల్‌పై మృణాల్ రియాక్షన్
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Samantha Son : మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత - బాబు క్యూట్ నేమ్ ఏంటో తెలుసా?
మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత - బాబు క్యూట్ నేమ్ ఏంటో తెలుసా?
Crime Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget